బ్రేక్ ఈవెన్ కష్టమేనేమో గణేషా..!

’14 రీల్స్ ప్లస్’ బ్యానర్ పై అనిల్ ఆచంట, రామ్ ఆచంట నిర్మించిన తాజా చిత్రం ‘గద్దలకొండ గణేష్’. హరీష్ శంకర్ డైరెక్షన్లో తెరకెక్కిన ఈ మాస్ ఎంటర్టైనర్ సెప్టెంబర్ 20 న విడుదలయ్యి పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకుంది. తమిళంలో సూపర్ హిట్టైన ‘జిగర్తాండ’ చిత్రానికి ఇది రీమేక్ కావడం విశేషం. వరుణ్ తేజ్ మాస్ అవతార్ కు ప్రేక్షకులు బ్రహ్మరధం పట్టారు. ఇక మొదటి వీకెండ్ మంచి కలెక్షన్లు రాబట్టిన ఈ చిత్రం ఆ తరువాత మాత్రం చతికిలపడిపోయింది.

గద్దలకొండ గణేష్‘ 10 రోజుల ఏరియా వైజ్ కలెక్షన్ల వివరాలు ఈ విధంగా ఉన్నాయి :

నైజాం 7.52 cr
సీడెడ్ 3.05 cr
ఉత్తరాంధ్ర 2.49 cr
ఈస్ట్ 1.48 cr
వెస్ట్ 1.41 cr
కృష్ణా 1.32 cr
గుంటూరు 1.68 cr
నెల్లూరు 0.85 cr
ఏపీ + తెలంగాణ 19.8 cr
రెస్ట్ అఫ్ ఇండియా 1.25 cr
ఓవర్సీస్ 1.65 cr
వరల్డ్ వైడ్ (టోటల్) 22.70 cr (షేర్)

‘గద్దలకొండ గణేష్’ చిత్రానికి 25 కోట్ల వరకూ ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. 10 రోజులు పూర్తయ్యే సరికి ఈ చిత్రం 22.70 కోట్ల షేర్ ను మాత్రమే రాబట్టింది. ఇంకా ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ కావాలంటే మరో 3 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది. సెకండ్ వీకెండ్ ను ఈ చిత్రం కనీసం క్యాష్ చేసుకోలేకపోయింది. కొత్త సినిమాలు ఏమీ లేకపోయినప్పటికీ.. జనాలు ఈ చిత్రాన్ని పట్టించుకోకపోవడం గమనార్హం. ఇక అక్టోబర్ 2 నుండీ ‘సైరా’ వస్తుంది కాబట్టి గణేష్ గట్టెక్కడం కష్టమనే చెప్పాలి.

గద్దలకొండ గణేష్ (వాల్మీకి) సినిమా రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి
గ్యాంగ్‌ లీడర్ సినిమా రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి

Read Today's Latest Collections Update. Get Filmy News LIVE Updates on FilmyFocus