‘గద్దలకొండ గణేష్’ గత్తర లేపిండు.. చింపేసిండు.!

’14 రీల్స్ ప్లస్’ బ్యానర్ పై అనిల్ ఆచంట, రామ్ ఆచంట నిర్మించిన చిత్రం ‘గద్దలకొండ గణేష్’. హరీష్ శంకర్ డైరెక్షన్లో తెరకెక్కిన ఈ మాస్ ఎంటర్టైనర్ సెప్టెంబర్ 20 న(నిన్న) విడుదలయ్యి పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకుంది. తమిళంలో సూపర్ హిట్టైన ‘జిగర్తాండ’ చిత్రానికి ఇది రీమేక్ కావడం విశేషం. వరుణ్ తేజ్ మాస్ అవతార్ కు ప్రేక్షకులు బ్రహ్మరధం పట్టారు. ఇక మొదటి రోజు ఈ చిత్రానికి అదిరిపోయే కలెక్షన్లు వచ్చాయి.

గద్దలకొండ గణేష్‘ ఏరియా వైజ్ కలెక్షన్ల వివరాలు ఈ విధంగా ఉన్నాయి :

నైజాం 1.89 cr
సీడెడ్ 0.81 cr
ఉత్తరాంధ్ర 0.70 cr
ఈస్ట్ 0.54 cr
వెస్ట్ 0.58 cr
కృష్ణా 0.41 cr
గుంటూరు 0.71 cr
నెల్లూరు 0.20 cr
ఏపీ + తెలంగాణ 5.81 cr
రెస్ట్ అఫ్ ఇండియా 0.42 cr
ఓవర్సీస్ 0.58 cr
వరల్డ్ వైడ్ (టోటల్) 6.81 cr (షేర్)

‘గద్దలకొండ గణేష్’ చిత్రానికి 25 కోట్ల వరకూ ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. మొదటి రోజు ఈ చిత్రానికి 6.81 కోట్ల షేర్ వచ్చింది. ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ కావాలంటే 18.5 కోట్ల వరకూ షేర్ ను రాబట్టాల్సి ఉంది. బి,సి సెంటర్స్ లో ఈ చిత్రానికి బుకింగ్స్ చాలా బాగున్నాయి. మొదటి వీకెండ్ పూర్తయ్యేసరికి 80 శాతం రికవరీ అయిపోవడం ఖాయమని ట్రేడ్ పండితులు చెప్పుకొస్తున్నారు.మరి వారి నమ్మకం ఎంత బలమైనదో చూడాలి..!

గద్దలకొండ గణేష్ (వాల్మీకి) సినిమా రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి
గ్యాంగ్‌ లీడర్ సినిమా రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి

Read Today's Latest Collections Update. Get Filmy News LIVE Updates on FilmyFocus