బిగ్ బాస్ హౌస్ లో ప్రస్తుతం సిసింద్రీ టాస్క్ అనేది నడుస్తోంది. ఇందులో భాగంగా హౌస్ మేట్స్ ప్రతి ఒక్కరూ బేబీ డాల్ ని జాగ్రత్తగా కాపాడుకుంటున్నారు. ఫస్ట్ టాస్క్ లో రేవంత్ ఓఢిపోవడం వల్ల కొద్దిగా డిస్సపాయింట్ అయ్యాడు. బేబీని ప్రాంక్ లో పెట్టి వదిలేశాడు. దీంతో కీర్తి జాగ్రత్త చేద్దామని బేబీని తీస్కుంది. కీర్తి దగ్గర్నుంచీ లాక్కున్న గలాటే గీతు బేబీ డాల్ ని తీస్కుని వెళ్లి లాస్ట్ అండ్ ఫైండ్ లో ఉంచేసింది. ఈ లాస్ట్ అండ్ ఫైండ్ లోకి చేరిన బేబీని బిగ్ బాస్ స్టోర్ రూమ్ లో పెట్టమని చెప్పాడు.
దీంతో బేబీని కోల్పోయిన రేవంత్ ఆట నుంచీ తప్పుకున్నాడు. అంతేకాదు, భోజనాల సమయంలో కూడా అజాగ్రత్తగా బేబీని పట్టించుకోని శ్రీసత్య తగిన మూల్యం చెల్లించుకుంది. బేబీని చేజిక్కించుకున్న గీతు శ్రీసత్య బేబీని కూడా లాస్ట్ అండ్ ఫైండ్ లో ఉంచేసింది. దీంతో శ్రీసత్య కూడా ఆటలో నుంచీ తప్పుకుంది. అలాగే, అభినయశ్రీ బేబిని పక్కనబెట్టి మాట్లాడుతోంది. అదే అదనుగా చూసిన గీతు అభి బేబీని కూడా అవుట్ చేసేసింది. లాస్ట్ అండ్ ఫైండ్ లో పెట్టేసిన తర్వాత కెప్టెన్ ఆదిత్య కన్సిడర్ చేసి బేబీని తిరిగి ఇచ్చాడు. కానీ, బిగ్ బాస్ మాత్రం ఒప్పుకోలేదు.
ఒక్కసారి అక్కడికి వచ్చిన బేబీ అవుట్ అయినట్లే అని, వారు ఆటలో నుంచీ తప్పుకున్నట్లే అని ఎనౌన్స్ చేశాడు. దీంతో గలాటే గీతు గెంతులు వేస్తూ స్టోర్ రూమ్ లో రెచ్చిపోయింది. తన మాస్టర్ బ్రైయిన్ ని ఉపయోగిస్తూ హౌస్ మేట్స్ కి ముచ్చెమటలు పట్టించింది. గలాటే గీతు దెబ్బకి ప్రతి ఒక్కరూ తమ బేబీని జాగ్రత్తగా దాచుకోవడం మొదలు పెట్టారు. అర్ధరాత్రి నిద్రలేచిన గీతు హౌస్ మేట్స్ పడుకున్నప్పుడు బేబీలని తీసుకుని వచ్చి లాస్ట్ అండ్ ఫౌండ్ లో వేసేసింది.
దీంతో హౌస్ మేట్స్ లో చాలామంది గేమ్ నుంచీ తప్పుకునే పరిస్థితి వచ్చింది. ఈ గేమ్ లో గలాటే గీతు తన తెలివితేటలు ఉపయోగిస్తూ గేమ్ లో ముందుకు దూసుకుపోతోంది. గీతుపై పగబట్టిన హౌస్ మేట్స్ గీతు బొమ్మ కోసం హౌస్ అంతా వెతకడం మొదలుపెట్టారు. స్టోర్ రూమ్ లో బొమ్మని దాచిపెట్టిన గీతు మాత్రం హాయిగా హ్యాపీగా ఇల్లంతా తిరుగుతూ ఎంజాయ్ చేస్తోంది. మరి ఈ గేమ్ లో గీతు కెప్టెన్సీ పోటీదారులు అవుతుందా ? లేదా రెండోవారం కెప్టెన్ అవుతుందా అనేది చూడాలి. అదీ మేటర్.