యువ హీరో ఫామ్ హౌజ్ పై పోలీసుల దాడులు

  • November 1, 2021 / 04:04 PM IST

టాలీవుడ్ ఇండస్ట్రీలో మరోసారి గ్యాంబ్లింగ్ కు సంబంధించిన ఆరోపణలు వేకువడుతున్నాయి. ఇటీవల సమాచారం అందుకున్న పోలీసులు అకస్మాత్తుగా జరిపిన దాడులలో ఒక హీరో ఫామ్ లో కూడా జూదం రాయుళ్లు రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడినట్లు తెలుస్తోంది. ఆ ఫామ్ హౌజ్ ఇటీవల ఒక కొత్త సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన యువ హీరోధేనని అంటున్నారు. కొందరు సమాచారం అంధించడంతో మాదాపూర్ పోలీసులు ఒక ప్రముఖ మీడియా ఛానెల్ తో కలిసి ఏకధాటిగా ఫామ్ హౌజ్ లో సోదాలు నిర్వహించారు.

హైదరాబాద్ శివార్లలోని మంచిరేవులలో ఉన్న ఆ ఫామ్ హౌజ్ ప్రముఖ టాలీవుడ్ యువ హీరోధేనని తెలుస్తోంది. ఫామ్‌హౌస్‌లో జూదం ఆడుతున్నట్లు గుర్తించిన పోలీసులు 25 మందిని అరెస్టు చేశారు. ఖరీదైన స్మార్ట్ మొబైల్ ఫోన్లు, స్వైపింగ్ మిషన్లు, అలాగే ప్లే కార్డులు, పేకాట చిప్‌లు స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. ఆ పేకాట నిర్వాహకుడు సుమంత్ చౌదరిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నారు. అలాగే క్రికెట్ బెట్టింగ్ జరుగుతుంది అనే ఆరోపణలు కూడా రావడంతో పోలీసులు అన్ని కోణాల్లో విచారణ జరుపుతున్నారు.

ఆ తెలుగు హీరో ఆరు నెలల క్రితం ఒక ఐఏఎస్ అధికారి నుంచి ఫామ్ హౌజ్ ను ఐదేళ్లపాటు లీజుకు తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇందులో హీరో పాత్ర ఎంతవరకు ఉందనే విషయంపై కూడా ఆరా తీస్తున్నట్లు సమాచారం.

వరుడు కావలెను సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

రొమాంటిక్ సినిమా రివ్యూ & రేటింగ్!
పునీత్ రాజ్ కుమార్ సినీ ప్రయాణం గురించి తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!
ఇప్పటివరకు ఎవ్వరూ చూడని పునీత్ రాజ్ కుమార్ ఫోటోలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus