మెగా పవర్ స్టార్ రాంచరణ్,స్టార్ డైరెక్టర్ శంకర్ కలయికలో రూపొందిన ‘గేమ్ ఛేంజర్’ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 10న రిలీజ్ అయ్యింది. ‘శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్’ బ్యానర్ పై దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మించారు. మొదటి షోతో ఈ సినిమా మిక్స్డ్ టాక్ వచ్చింది. అయినప్పటికీ మొదటి రోజు మంచి ఓపెనింగ్స్ వచ్చాయి.రెండో రోజు, మూడో రోజు కూడా కొన్ని ఏరియాల్లో పర్వాలేదు అనిపించింది.
‘గేమ్ ఛేంజర్’ సినిమాకు రూ.250 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే రూ.255 కోట్లు షేర్ ను రాబట్టాలి. 3 రోజుల్లో ఈ సినిమాకు రూ.74.98 కోట్ల షేర్ వచ్చింది. బ్రేక్ ఈవెన్ కోసం మరో రూ.180.02 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది.