పెద్ద స్టార్ హీరోల సినిమాలు రిలీజ్ అయితే.. ఇండస్ట్రీలో, ట్రేడ్లో అదే హాట్ టాపిక్ అవుతుంది. నార్మల్ డేస్లో కంటే కూడా స్టార్ హీరోల సినిమాలు రిలీజ్ అయ్యే టైంలో జనాలు థియేటర్లకు ఎక్కువగా వెళ్తూ ఉంటారు. అందుకే వాళ్ళ సినిమాల బడ్జెట్, బిజినెస్..లకి తగ్గట్టు ఓపెనింగ్స్ రాబట్టుకోవడానికి, నిర్మాతలు టికెట్ రేట్ల పెంపు కోసం, అదనపు షోల కోసం ప్రభుత్వాలకి రిక్వెస్ట్..లు పెట్టుకుంటారు. తద్వారా టాక్ తో సంబంధం లేకుండా మొదటి రోజు ఆ పెద్ద హీరోల సినిమాలకి భారీ వసూళ్లు వస్తాయి. ఒకవేళ టాక్ కనుక పాజిటివ్ గా వస్తే.. వీకెండ్ మొత్తం క్యాష్ చేసుకునే అవకాశం ఉంటుంది.
తాజాగా రిలీజ్ అయిన ‘గేమ్ ఛేంజర్’ కి కూడా ఇలాంటి హడావిడే చూశాము. మొదటి రోజు ఈ సినిమాకి మిక్స్డ్ టాక్ వచ్చినప్పటికీ ఓపెనింగ్స్ బాగానే వచ్చాయి. అలా అని రికార్డులు క్రియేట్ చేసింది లేదు. సరే ఇంతకీ ‘గేమ్ ఛేంజర్’ కి ఎంత గ్రాస్ వచ్చింది. ఆ సినిమా ఎన్నో ప్లేస్లో ఉంది. టాలీవుడ్ టాప్ 10 గ్రాసర్స్ ఏంటి? అనే విషయాల పై ఓ లుక్కేద్దాం రండి :
1) పుష్ప 2 :
అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్లో రూపొందిన ‘పుష్ప 2′(ది రూల్) సినిమా.. 2024 డిసెంబర్ 05 న రిలీజ్ అయ్యింది. డిసెంబర్ 4 రాత్రి నుండి ప్రీమియర్స్ కూడా పడ్డాయి. టాక్ కూడా పాజిటివ్ గా రావడంతో మొదటి రోజు ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద వరల్డ్ వైడ్ గా రూ.247 కోట్ల గ్రాస్..ని(అన్ని భాషలు కలుపుకుని) కలెక్ట్ చేసి నెంబర్ వన్ ప్లేస్లో ఉంది.
2) ఆర్.ఆర్.ఆర్ :
ఎన్టీఆర్, రాంచరణ్ …ల భారీ మల్టీస్టారర్ కి రూపకర్త దర్శకుడు రాజమౌళి. రాజమౌళి సినిమాకి టాక్ తో సంబంధం ఉండదు. గ్రాండ్ రిలీజ్ మాత్రమే మేటర్. అందుకే మొదటిరోజు ఈ సినిమా వరల్డ్ వైడ్ గా రూ.236 కోట్ల గ్రాస్ ను కలెక్ట్ చేసింది.
3) బాహుబలి 2 :
ప్రభాస్, దర్శకుడు ఎస్.ఎస్.రాజమౌళి కాంబినేషన్లో తెరకెక్కిన ఈ సినిమా.. వరల్డ్ వైడ్ గా మొదటి రోజు రూ.209 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టి ఆల్ టైం రికార్డులు సృష్టించింది.
4) కల్కి 2898 AD :
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, దర్శకుడు నాగ్ అశ్విన్ కాంబినేషన్లో తెరకెక్కిన ఫ్యూచరిస్టిక్ అండ్ సైన్స్ ఫిక్షన్ మూవీ ‘కల్కి 2898 ad’. జూన్ 27న రిలీజ్ అయిన ఈ సినిమా కూడా తొలి రోజు పాజిటివ్ టాక్ తెచ్చుకుంది బాక్సాఫీస్ వద్ద రూ.185 కోట్ల గ్రాస్ ను కలెక్ట్ చేసింది.
5) సలార్(పార్ట్ 1 : సీజ్ ఫైర్) :
ప్రభాస్, దర్శకుడు ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో రూపొందిన ఈ ‘సలార్'(పార్ట్ 1) డిసెంబర్ 22న రిలీజ్ అయ్యి.. మొదటిరోజు పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. దీంతో మొదటి రోజు వరల్డ్ వైడ్ గా రూ.158 కోట్ల గ్రాస్ ను కొల్లగొట్టింది.
6) దేవర(మొదటి భాగం) :
ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో ‘జనతా గ్యారేజ్’ వంటి సూపర్ హిట్ మూవీ తర్వాత రూపొందిన సినిమా ‘దేవర’. 2024 సెప్టెంబర్ 27న రిలీజ్ అయిన ఈ సినిమా .. మిక్స్డ్ టాక్ తెచ్చుకున్నప్పటికీ, మొదటి రోజు వరల్డ్ వైడ్ గా రూ.156 కోట్ల గ్రాస్ ను కలెక్ట్ చేసింది.
7) ఆదిపురుష్ :
ప్రభాస్ హీరోగా ఓం రౌత్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మైథలాజికల్ డ్రామా.. 2023 జూన్లో గ్రాండ్ గా రిలీజ్ అయ్యి.. మొదటి రోజు బాక్సాఫీస్ వద్ద మిక్స్డ్ టాక్ తో కూడా వరల్డ్ వైడ్ గా రూ.137 కోట్ల గ్రాస్ ను కలెక్ట్ చేసింది.
8) సాహో :
ప్రభాస్ హీరోగా తెరకెక్కిన ఈ యాక్షన్ మూవీకి సుజీత్ దర్శకుడు. భారీ బడ్జెట్ తో రూపొందిన ఈ సినిమా వరల్డ్ వైడ్ గా రూ.130 కోట్ల గ్రాస్ వసూళ్లను కొల్లగొట్టింది.
9) గేమ్ ఛేంజర్ :
మెగా పవర్ స్టార్ రాంచరణ్ హీరోగా శంకర్ దర్శకత్వంలో రూపొందిన పొలిటికల్ అండ్ యాక్షన్ డ్రామా ‘గేమ్ ఛేంజర్’. దిల్ రాజు నిర్మాణంలో రూపొందిన ఈ సినిమా మొదటి రోజు బాక్సాఫీస్ వద్ద వరల్డ్ వైడ్ గా రూ.89 కోట్ల గ్రాస్ ను కలెక్ట్ చేసింది.
10) గుంటూరు కారం :
సూపర్ స్టార్ మహేష్ బాబు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో రూపొందిన ఈ మాస్ అండ్ ఫ్యామిలీ డ్రామా ‘గుంటూరు కారం’ మొదటి రోజు ఈ సినిమా మిక్స్డ్ టాక్ తో కూడా వరల్డ్ వైడ్ గా రూ.87 కోట్లు గ్రాస్ ను కొల్లగొట్టింది.