Game Changer: గేమ్ ఛేంజర్.. కోలీవుడ్ లో కలిసొచ్చే ఛాన్స్?

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan), దర్శక దిగ్గజం శంకర్ (Shankar)  కాంబినేషన్ లో తెరకెక్కుతోన్న గేమ్ ఛేంజర్ (Game Changer) పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 10న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. తెలుగులోనే కాకుండా పాన్ ఇండియా రేంజ్ లో ఈ చిత్రం భారీ విజయాన్ని అందుకోవాలని టీం ఆశిస్తోంది. ముఖ్యంగా కోలీవుడ్ లో శంకర్ తీసిన సినిమా కాబట్టి అక్కడి ప్రేక్షకుల్లో కూడా భారీ ఎక్స్ పెక్టేషన్ ఉంది.

Game Changer

ఇటీవల కాలంలో తెలుగు సినిమాలు తమిళనాడులో సరిగ్గా సక్సెస్ కావడం లేదు. అయితే గేమ్ ఛేంజర్ విషయంలో ఆ పరిస్థితి మారే అవకాశముందని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి. రామ్ చరణ్, రాజమౌళి (S. S. Rajamouli) కాంబోలో వచ్చిన RRR (RRR) అక్కడ మంచి వసూళ్లు సాధించినప్పటికీ, అది పాన్ ఇండియా సినిమా కావడం వల్ల ఆ ఇంపాక్ట్ సాధ్యమైంది. ఈసారి, శంకర్ దర్శకత్వం కారణంగా తమిళ ప్రేక్షకులు ఈ సినిమాపై ఆసక్తిగా ఉన్నారు.

అయితే సంక్రాంతి పోటీలో కోలీవుడ్ లో భారీ చిత్రమైన అజిత్ నటిస్తున్న విదా ముయార్చి కూడా ఉంది. ఈ చిత్రం కూడా పొంగల్ బరిలో దిగుతుందని ప్రకటించడమే గేమ్ ఛేంజర్ కు కొన్ని సవాళ్లను తెచ్చిపెట్టింది. కానీ తాజా పరిణామాల ప్రకారం, ఈ సినిమా పై కాపీ రైట్ ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో విడుదల విషయంలో సందిగ్ధత నెలకొంది. ఈ సినిమా విడుదల వాయిదా పడే అవకాశం ఉందని తమిళనాడు సినీ వర్గాలు చెబుతున్నాయి.

అజిత్ (Ajith) సినిమా పోటీ నుంచి తప్పుకుంటే గేమ్ ఛేంజర్ తమిళనాడులో మరింతగా మార్కెట్ పెంచుకునే అవకాశం ఉంది. రామ్ చరణ్, శంకర్ కాంబినేషన్ ఈ సినిమాకు భారీగా హైప్ తీసుకురావడమే కాకుండా, రీజనల్ మార్కెట్లను బలంగా దాటడానికి ఉపయోగపడుతుందని ట్రేడ్ ఎనలిస్ట్‌లు భావిస్తున్నారు. అజిత్ అజిత్ చిత్రం వాయిదా పడితే, గేమ్ ఛేంజర్ తమిళనాడులో మరింత బలమైన స్థాయిని ఏర్పరచుకుని, సంక్రాంతి సీజన్ లో ప్రధాన హిట్ గా నిలిచే అవకాశం ఉంది.

‘ఆటో జానీ’కి ముందు మరో కథ అనుకున్నారు… ఆ పేరేంటో తెలుసా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus