మంచు మోహన్ బాబు (Mohan Babu) హాస్పిటల్ పాలైనట్లు తెలుస్తుంది. ఆయన వయసు ప్రస్తుతం 72. పైగా ఆయన ఆరోగ్యం కూడా అంతంత మాత్రంగానే ఉంటుంది. ఇలాంటి టైంలో ఇంట్లో గొడవలు జరుగుతున్నాయి. అతని చిన్న కొడుకు మంచు మనోజ్ ని (Manchu Manoj) మోహన్ బాబు, పెద్ద కొడుకు విష్ణుతో (Manchu Vishnu) కలిసి కొట్టించాడు అంటూ వార్తలు వస్తున్న నేపథ్యంలో.. మనోజ్ నిజమే అని పోలీస్ స్టేషన్ కి వెళ్లి కంప్లైంట్ ఇచ్చాడు. ఆ తర్వాత నుండి ఇప్పటివరకు జరుగుతుంది అంతా అందరికీ తెలుసు.
ఇక తాజాగా జల్ పల్లిలో ఉన్న మోహన్ బాబు ఇంటికి మనోజ్ వెళ్లగా అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. మనోజ్ గేట్లు గెంతుకుంటూ ముందుకు వెళ్లారు. ఆయన వెంట మీడియా ప్రతినిధులు కూడా వెళ్లారు. ఈ క్రమంలో మోహన్ బాబు ఆవేశంతో ఊగిపోయారు. మీడియా వాళ్ళపై కూడా ఆయన దాడి చేసిన విజువల్స్ అంతా చూసే ఉంటారు. ప్రస్తుతం అవి వైరల్ అవుతున్నాయి. మరోపక్క ఆవేశంతో ఉన్న మోహన్ బాబుకు బీపీ పెరిగి.. ఛాతి వద్ద నొప్పిగా వచ్చినట్టు సమాచారం.
దీంతో దగ్గర్లో ఉన్న హాస్పిటల్ కి ఆయన తరలించినట్లు తెలుస్తోంది. ఆయన హెల్త్ కండిషన్ గురించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. మరోపక్క మోహన్ బాబు సతీమణి, మంచు మనోజ్ తల్లి అయినటువంటి నిర్మలా దేవి కూడా అనారోగ్యంతో హాస్పిటల్ పాలైనట్లు మోహన్ బాబు విడుదల చేసిన ఆడియో క్లిప్లో ఉంది. ‘నీ వల్లే మీ అమ్మ అనారోగ్యంపాలై హాస్పిటల్లో ఉంది’ అంటూ మోహన్ బాబు చెప్పడం జరిగింది.