Siddharth: పుష్ప 2: మరోసారి నోరు జారిన సిద్ధార్థ్..!

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) , సుకుమార్ (Sukumar) కాంబోలో వచ్చిన ‘పుష్ప 2’ (Pushpa 2: The Rule) దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న విషయం తెలిసిందే. పాన్ ఇండియా లెవెల్లో ఈ సినిమా అంచనాలకు తగ్గట్టే మొదటి రోజు నుంచే భారీ వసూళ్లు సాధిస్తోంది. విడుదలకు ముందు పాట్నాలో నిర్వహించిన ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి వచ్చిన భారీ జనసందోహం ‘పుష్ప 2’ క్రేజ్‌ను మరోసారి నిరూపించింది. అయితే ఈ ఈవెంట్ మీద కోలీవుడ్ హీరో సిద్ధార్థ్ (Siddharth)  చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి.

Siddharth

తన తాజా సినిమా ప్రమోషన్‌ సందర్భంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో, పుష్ప 2 పాట్నా ఈవెంట్ గురించి మాట్లాడుతూ సిద్ధార్థ్, “మన దేశంలో జనసమూహం గుమిగూడడం పెద్ద విశేషం కాదు. కన్‌స్ట్రక్షన్ సైట్ దగ్గర జేసీబీ సౌండ్ వచ్చినా జనం గుమికూడతారు” అని చెప్పాడు. అంతే కాదు, “జనం రావడం మాత్రమే హిట్‌కి సంకేతం అయితే, ప్రతి రాజకీయ పార్టీ మీటింగ్‌లకు జనాలు వస్తారు. ఆ పార్టీలు అన్నీ గెలుస్తున్నాయా? – ఒక విధంగా బీరు బిర్యాని వల్లే జనాలు రాజకీయ సభలకు వస్తారని మనం మాట్లాడుకుంటాము..

అంటూ సిద్దార్థ్ చేసిన కామెంట్ అందరిని ఆశ్చర్యాన్ని కలిగించింది. సిద్ధార్థ్ వ్యాఖ్యలు పుష్ప 2 పై ఇన్‌డైరెక్ట్‌గా వెటకారంగా మారాయి. దీనిపై నెటిజన్లు మండిపడుతున్నారు. “పుష్ప 2” కలెక్షన్స్ రూపంలో సక్సెస్‌ను సాధించడం ఎవరి అభిప్రాయానికీ సంబంధించినది కాదు, అది ప్రేక్షకుల ఆదరణకు నిదర్శనం అని కామెంట్లు చేస్తున్నారు. సిద్ధార్థ్ వ్యాఖ్యలు గమనించి, “పుష్ప 2 లాంటి సినిమా విజయానికి అతని మాటలతో ఎలాంటి ప్రభావం ఉండదు” అని నెటిజన్లు రివర్స్ ఫైర్ చేస్తున్నారు.

సిద్ధార్థ్ ఇలాంటి వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం ఇది మొదటిసారి కాదు. గతంలో ‘పుష్ప 2’ కంటే తన సినిమా ముందే విడుదల కావాలని అనుకున్న సమయంలో, “పుష్ప 2 రిలీజ్ ఉంటే ఏంటి, నా సినిమాను చూసి వారే ఆలోచించుకోవాలి” అంటూ చేసిన కామెంట్ కూడా విమర్శలకు గురైంది. కానీ తీరా పుష్ప 2 క్రేజ్‌ను చూసి, తన సినిమా విడుదలను వాయిదా వేసుకోవాల్సి వచ్చింది.

‘పుష్ప 2’ .. వర్కింగ్ డే అయినా సరే అక్కడ కుమ్మేసింది..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus