Gandeevadhari Arjuna Collections: ‘గాండీవదారి అర్జున’ మొదటి వీకెండ్ ఎంత కలెక్ట్ చేసిందంటే?

Advertisement

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా ‘ఏజెంట్’ ఫేమ్ సాక్షి వైద్య హీరోయిన్ గా ప్రవీణ్ సత్తార్ దర్శకత్వంలో ‘గాండీవధారి అర్జున’ అనే సినిమా రూపొందిన సంగతి తెలిసిందే. ‘శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర’ బ్యానర్ పై బీవీఎస్ఎన్ ప్రసాద్ – బాపినీడు ఈ చిత్రాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. టీజర్ , ట్రైలర్స్ లో యాక్షన్ ఎలిమెంట్స్ అలరించాయి. ఆగస్టు 25 న ఈ సినిమా గ్రాండ్ గా రిలీజ్ కాబోతోంది. మొదటి నుండి ఈ సినిమా పై ఎటువంటి పెద్దగా అంచనాలు లేవు.

ఇక మొదటి రోజు మొదటి షో కే నెగిటివ్ టాక్ కూడా రావడంతో కలెక్షన్స్ ఆశించిన స్థాయిలో రాలేదు.మొదటి రోజు సో సోగా ఉన్నా.. రెండో రోజు నుండి ఈ సినిమా కలెక్షన్స్ చాలా వరకు పడిపోయాయి. ఒకసారి ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్ ని గమనిస్తే :

నైజాం 0.29 cr
సీడెడ్ 0.12 cr
ఉత్తరాంధ్ర 0.13 cr
ఈస్ట్ 0.09 cr
వెస్ట్ 0.08 cr
గుంటూరు 0.06 cr
కృష్ణా 0.11 cr
నెల్లూరు 0.05 cr
ఏపీ + తెలంగాణ (టోటల్) 0.93 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా 0.20 cr
ఓవర్సీస్ 0.21 cr
వరల్డ్ వైడ్ (టోటల్) 1.34 cr (షేర్)

‘గాండీవదారి అర్జున’ (Gandeevadhari Arjuna) చిత్రానికి రూ.15.8 కోట్లు థియేట్రికల్ బిజినెస్ జరిగినట్లు తెలుస్తుంది. దీంతో ఈ సినిమా బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే రూ.16 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది. మొదటి వీకెండ్ పూర్తయ్యేసరికి ఈ చిత్రం కేవలం రూ.1.34 కోట్లు షేర్ ను రాబట్టింది. బ్రేక్ ఈవెన్ కి మరో రూ.14.66 కోట్ల దూరంలో ఉంది అని చెప్పాలి.

https://www.youtube.com/watch?v=d_qU7Fk3-L0

మిడ్ రేంజ్ హీరోలు చేసిన ఈ 10 యాక్షన్ సినిమాలు భారీ నష్టాలు మిగిల్చాయని మీకు తెలుసా?

మెహర్ రమేష్ తో పాటు పెద్ద హీరోలు ఛాన్సులు ఇచ్చినా హిట్లివ్వలేకపోయిన డైరెక్టర్ల లిస్ట్.!
రామ్ నీ బాలయ్య ఏమని తిట్టాడో తెలిస్తే షాక్ అవుతారు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus