అదేంటో కానీ ఒక్కోసారి ఎంత మంచి టాక్ వచ్చినా.. కలెక్షన్లు మాత్రం రావు. ఒక్కో సినిమాకి డిజాస్టర్ టాక్ వచ్చినప్పటికీ కలెక్షన్లు అదిరిపోతుంటాయి. రిలీజ్ టైమింగ్ బ్యాడో.. ఏమో కానీ… గతవారం విడుదలైన ‘గ్యాంగ్ లీడర్’ చిత్రానికి మంచి టాక్ వచ్చినప్పటికీ కలెక్షన్లు మాత్రం సరిగ్గా రాబట్టలేకపోతుంది. వీకెండ్ వరకూ మంచి కలెక్షన్లను రాబట్టిన ‘నానీస్ గ్యాంగ్ లీడర్’.. వీక్ డేస్ లో మాత్రం ఆ జోరు చూపించలేకపోయిందనే చెప్పాలి.
ఇక ఈ చిత్రం మొదటి వారం ఏరియా వైజ్ కలెక్షన్ల వివరాలు ఈ విధంగా ఉన్నాయి :
నైజాం | 5.81 cr |
సీడెడ్ | 1.46 cr |
వైజాగ్ | 1.91 cr |
ఈస్ట్ | 1.20 cr |
వెస్ట్ | 0.87 cr |
కృష్ణా | 1.1 cr |
గుంటూరు | 1.15 cr |
నెల్లూరు | 0.48 cr |
ఏపీ + తెలంగాణ | 13.98 cr |
రెస్ట్ అఫ్ ఇండియా | 1.55 cr |
ఓవర్సీస్ | 3.28 cr |
వరల్డ్ వైడ్ (టోటల్) | 18.81 cr (షేర్) |
‘నానీస్ గ్యాంగ్ లీడర్‘ చిత్రానికి 28 కోట్ల వరకూ ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. మొదటి వారం పూర్తయ్యేసరికి ఈ చిత్రం కేవలం 18.81 కోట్ల షేర్ ను మాత్రమే రాబట్టింది. అంటే 63 శాతం మాత్రమే రికవరీ అయ్యిందన్న మాట. ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ కావాలంటే మరో 10 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది. కానీ ఈరోజు విడుదలైన వరుణ్ తేజ్, హరీష్ శంకర్ల ‘గద్దల కొండగణేష్’ (‘వాల్మీకి’) కు మంచి టాక్ వచ్చింది. మాస్ జనాలు ఈ చిత్రం కోసం ఎగపడుతున్నారు. కాబట్టి ‘నానీస్ గ్యాంగ్ లీడర్’ కలెక్షన్ల పై దాని ప్రభావం ఎక్కువే పడుతుంది అనడంలో సందేహం లేదు. ఇక ‘నానీస్ గ్యాంగ్ లీడర్’ ఫుల్ రన్లో ఎంత కలెక్ట్ చేస్తుందో చూడాలి మరి..!
గద్దలకొండ గణేష్ (వాల్మీకి) సినిమా రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి
గ్యాంగ్ లీడర్ సినిమా రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి