బిగ్‌బాస్‌ 4 ఎలిమినేషన్‌లో నవ్వులు పూయించిన గంగవ్వ!

బిగ్‌బాస్‌ 4 చూడటానికి ఒక కారణం గంగవ్వ. నిన్న స్పెషల్‌ పార్టిసిపెంట్‌ బిగ్‌బాస్‌లోకి ఆమె అడుగుపెట్టింది మొదలు నెటిజన్ల మాట ఇదే. మీమ్స్‌, సోషల్‌ పోస్టులు కూడా అదే చెబుతున్నాయి. దానికి కారణం కూడా లేకపోలేదు. యూట్యూబ్‌లో ఆమె వీడియోలు చూసేవాళ్లందరికీ ఆమె ఎంత మాసో తెలుసు. పక్కా తెలంగాణ యాసలో ఆమె మాటలు నవ్వులు పూయిస్తాయి. ఈసారి బిగ్‌బాస్‌లో కూడా అదే జరుగుతుందని అందరూ అనుకుంటున్నారు. తొలి రోజు ప్రోమోతో అది నిజమనే నిరూపించింది గంగవ్వ. ఇంతకీ ఏమైందంటే?

బిగ్‌బాస్‌ 4 తొలి నామినేషన్‌ ఈ రోజు జరగబోతోంది. దీనికి సంబంధించి నిన్న ఎపిసోడ్‌ పూర్తవ్వగానే బిగ్‌బాస్‌ టీజర్‌లో చూపించేశారు. అయితే అందులో ఏం చేస్తారు, ఎలా చేస్తారు అనే ఆసక్తి ఉండేది. దానిని ఈ రోజు ప్రోమోలో చూపించారు. పార్టిసిపెంట్స్‌లో ఎవరిని మీరు నామినేట్‌ చేస్తారో చెప్పండంటూ కిటికీల కాన్సెప్ట్‌ తీసుకొచ్చాడు బిగ్‌బాస్‌. నామినేట్‌ చేసేవారి ముఖం మీద కిటికీ మూసేయండి అని చెప్పాడు. ఇంకేముంది అందరూ అదే పని చేశారు. సూర్యకిరణ్‌, అమ్మ రాజశేఖర్‌, కల్యాణి ఎవరిని నామినేట్‌ చేశారో చూపించలేదు. కేవలం ముఖాన తలుపులేయడం మాత్రమే చూపించారు.

25 సెకన్ల ప్రోమోలో మొదటి 11 నిమిషాలు ఒకెత్తు అయితే 12 సెకన్‌లో ఎంట్రీ ఇచ్చిన గంగవ్వ పంచ్‌ మరో ఎత్తు. అభిజిత్‌, హారికలో ఒకరిని నామినేట్‌ చేయమని బిగ్‌బాస్‌ గంగవ్వను అడుగుతాడు. అక్కడే అసలు మజా మొదలైంది. అందరిలా ఫలానా మనిషిని నామినేట్‌ చేద్దాం అనుకునే రకం కాదు కదా మన గంగవ్వ. అలా అని ఊరుకునే రకమూ కాదు. ఓ స్మార్ట్‌ పంచ్‌డైలాగ్‌ విసింది. దీంతో అందరూ నవ్వుల్లో మునిగిపోయారు. ఇంతకీ గంగవ్వ ఏమందనేగా మీ మాట. ‘ఎవరైనా ఎందుకు, ఇద్దరూ మొన్ననే వచ్చిరు కదా’ అని కౌంటర్‌ వేసింది. మరి బిగ్‌బాస్‌ ఈ మాటకు ఏమంటాడో తెలియదు కానీ… పక్కన కూర్చున్న సుజాత, లాస్య మాత్రం తెగ మురిసిపోయారు. అభిజిత్‌ చిరు నవ్వులు చిందించగా, సూర్యకిరణ్‌ ఫక్కున నవ్వేశాడు. మీరూ మాస్‌ గంగవ్వ ఎలా చెప్పిందో చూసి నవ్వేయండి.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus