బిగ్ బాస్ 4: జీతం తీసుకొని గంగవ్వని ఫెయిల్ చేశారా?

గంగవ్వ ఎంత మాసో మనకు తెలుసు. కుర్రాళ్లు సైతం కంగుతినేలా పంచులు వేస్తుంది. ఇదంతా బిగ్ బాస్ ముందు.. మరి బిగ్ బాస్ లోకి వచ్చాక ఏంటి అనుకునేవాళ్లకు తొలి రోజు నామినేషన్ టైం లో ‘టైమింగ్’ పంచ్ ఇచ్చింది. దీంతో నామినేషన్ జోన్ నవ్వులతో నిండిపోయింది. సోషల్ మీడియా కూడా గంగవ్వ మాస్ అంటూ ఊగిపోయింది. రెండో రోజు కూడా ఆమె పంచ్ ల ప్రవాహం కొనసాగుతోంది. ఈ రోజు రిలీజ్ చేసిన ప్రోమోలో కరాటే కల్యాణికి ఆ పంచ్ తగిలింది.

రెండో రోజు టాస్క్ గా బిగ్ బాస్ క్లాస్ రూమ్ లో టీచర్ అండ్ స్టూడెంట్స్ థీమ్ ఇచ్చాడు. ఇందులో కల్యాణి టీచర్. మిగిలిన వాళ్ళు స్టూడెంట్స్. ఇక్కడి దాకా బాగుంది. క్లాస్ చెబుతూ కల్యాణి తిన్నగా ఉండక… ‘గంగవ్వ 50 ఏళ్ల నుంచి నువ్వు ఇక్కడే ఉన్నావ్’ అని అంది. దీంతో స్టూడెంట్స్ ‘గంగవ్వ ఫెయిల్ అయ్యిందా’ అని సన్నాయి నొక్కులు నొక్కారు. ఇక గంగవ్వ ఎటాక్ షురూ అయింది. ‘జీతం తీసుకోబడితివి…

అందరిని ఫెయిల్ చెయ్యబడితివి’ అని కౌంటర్ వేసింది. అలా అని ఊరుకోకుండా ‘పిచ్చాసుపత్రి లెక్క చేస్తున్నావ్’ అని ఘాటుగా అంది. అన్నది గంగవ్వే కాబట్టి అందరూ నవ్వేశారు. అదే ఇంకెవరైనా అంటేనా… ఈ పాటికి కరాటే కల్యాణి కరకరలాడేది. ప్రోమో మొదట్లో సూర్యకిరన్ టంగ్ ట్విస్టర్ సాంగ్ పాడాడు. పెడరాప్ పాటకి స్పూఫ్ అనుకుంటా… సూపర్ ఉంది. రాత్రి ఏపిసోడ్లో పూర్తిగా చూద్దాం.


బిగ్‌బాస్ 4 కంటెస్టెంట్స్ గురించి మీకు తెలియని ఆసక్తికరమైన విషయాలు!
బిగ్‌బాస్‌ 4 హైలెట్స్: ఏడుపులు.. అలకలు.. ఆగ్రహాలు.. ఆవేశాలు!
బిగ్ బాస్ 4 నామినేషన్: కిటికీల ఆటలో తలుపులు మూసేసింది ఎవరికంటే?

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus