పూరి-పవన్ ల గొడవ వలన ఆ హీరో లాభపడ్డారట..!

పవన్ కళ్యాణ్ బద్రి మూవీ 20 ఏళ్ళు పూర్తి చేసుకుంది. ఇది దర్శకుడు పూరి జగన్నాధ్ కి మొదటి చిత్రం కాగా, పవన్ కళ్యాణ్ కి ఆరవ చిత్రం. సుస్వాగతం, తొలిప్రేమ, తమ్ముడు ఇలా వరుస హిట్లతో జోరు మీదున్న పవన్ ని ఓ డెబ్యూ డైరెక్టర్ గా పూరి తన సినిమాకు ఒప్పించారంటే అది సంచలనమే. పూరి పవన్ కళ్యాణ్ ఇమేజ్ కి తగ్గట్టుగా లవ్, ఎమోషన్స్, హ్యూమర్ మరియు యాక్షన్ కలగలిపి ఓ ఫుల్ ప్యాక్డ్ ఎంటర్టైనర్ సిద్ధం చేశారు. పవన్ కి స్టార్ హోదా తెచ్చిన చిత్రంగా బద్రి ఉంది.

ఈ చిత్రం తరువాత మాస్ ఇమేజ్ కూడా పవన్ కి యాడ్ అయ్యింది. బ్యూటిఫుల్ హీరోయిన్స్ అమీషా పటేల్, రేణూ దేశాయ్ లు పూరి పాత్రలకు చక్కగా సరిపోయారు. రమణ గోగుల సంగీతం యూత్ ని ఓ ఊపు ఊపింది. మరి ఇంత పెద్ద బ్లాక్ బస్టర్ తరువాత పూరి-పవన్ కళ్యాణ్ కాంబినేషన్ లో మూవీ రావడానికి 12 ఏళ్ళు పట్టింది. 2012లో వచ్చిన కెమెరామెన్ గంగతో రాంబాబు చిత్రం కోసం వీళ్లిద్దరు కలిసి పని చేశారు. మరి ఇంత గ్యాప్ వీళ్లకు ఎందుకు వచ్చింది అనేది ఆసక్తికర విషయం.

ఐతే బద్రి తరువాత పవన్ పూరి ల మధ్య ఓ విషయమై మనస్పర్థలు వచ్చినట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి. పూరి జగన్నాధ్ హీరో రవితేజతో చేసిన అమ్మ నాన్న ఓ తమిళ అమ్మాయి మూవీ పవన్ కోసం రాసుకున్నదే అని కూడా వినిపించింది. పవన్ తో అప్పుడు పూరికి సయోధ్య లేకపోవడంతో ఆ కథను రవి తేజ హీరోగా తెరకెక్కించారని టాలీవుడ్ లో గుసగుసలు వినిపించాయి. సూపర్ డూపర్ హిట్ కొట్టిన ఆ చిత్రం రవి తేజ కెరీర్ కి చాలా ప్లస్ అయ్యింది. ఇక వీరి మధ్య మనస్పర్థలు తొలిగి 2012లో కలిసి కెమెరామెన్ గంగతో రాంబాబు అనే పొలిటికల్ యాక్షన్ ఎంటర్టైనర్ చేశారు. ఆ మూవీ యావరేజ్ గా మిగిలింది

Most Recommended Video

తండ్రికి తగ్గ తనయలు అనిపిస్తున్న డైరెక్టర్స్ కూతుళ్లు!
నిర్మాతలుగా కూడా సత్తా చాటుతున్న టాలీవుడ్ హీరోలు!
టాలీవుడ్ టాప్ హీరోల వరస్ట్ లుక్స్ ఇవే!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus