Garividi Lakshmi Collections: ‘గరివిడి లక్ష్మి’ బాక్సాఫీస్ పరిస్థితి ఏంటి?
- October 18, 2026 / 07:44 PM ISTByPhani Kumar
ఉత్తరాంధ్ర జానపద గాయిని, తన గాత్రంతో పుష్కరకాలం పాటు అక్కడి జనాలను ఉర్రూతలూగించిన కళాకారిణి ‘గరివిడి లక్ష్మి’. ఆమె జీవిత కథతో ‘గరివిడి లక్ష్మి'(Garividi Lakshmi) అనే సినిమా రూపొందింది. ఆనంది టైటిల్ రోల్ పోషించిన ఈ సినిమాని ‘పీపుల్ మీడియా ఫ్యాక్టరీ’ సంస్థపై టిజి విశ్వప్రసాద్, కృతి ప్రసాద్ నిర్మించారు. గౌరి నాయుడు జమ్ము ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయమయ్యారు. చరణ్ అర్జున్ ఈ చిత్రానికి సంగీతం అందించారు.
Garividi Lakshmi

ఆనందితో పాటు ఈ సినిమాలో రాగ్ మయూర్, వి కె నరేశ్, రాశి, శరణ్య ప్రదీప్, అంకిత్ కొయ్య వంటి క్రేజీ ఆర్టిస్టులు కూడా నటించారు. కంటెంట్ పై ఉన్న కాన్ఫిడెన్స్ తో చిత్ర బృందం రిలీజ్ కి ముందు పలు ఏరియాల్లో ప్రీమియర్ షోలు వేయడం జరిగింది. వాటికి పాజిటివ్ రెస్పాన్స్ రావడంతో.. మొదటి రోజు ఈ సినిమాకి పర్వాలేదు అనే రేంజ్లో ఓపెనింగ్స్ నమోదయ్యాయి. నైజాంలో ఈ చిత్రాన్ని ‘మైత్రి మూవీ మేకర్స్’ సంస్థ రిలీజ్ చేసింది.
భారీ పోటీలో కూడా నైజాంలో 80 సింగిల్ స్క్రీన్స్ లో ఈ చిత్రాన్ని రిలీజ్ చేశారు ‘మైత్రి’ వారు. ఆంధ్రాలో 170 సింగిల్ స్క్రీన్స్ లభించాయి. ఇక మల్టీప్లెక్సుల్లో లిమిటెడ్ షోలతో మొదలైనప్పటికీ.. పాజిటివ్ టాక్ రావడంతో కొన్ని షోలు పెంచారు. ఇక కలెక్షన్స్ పరంగా చూసుకుంటే.. మొదటి రోజు(ప్రీమియర్ షోలతో కలుపుకొని) ‘గరివిడి లక్ష్మి’ సినిమా రూ.0.68 కోట్ల వరకు గ్రాస్ ను కలెక్ట్ చేసింది. షేర్ పరంగా రూ.0.40 కోట్ల వరకు వచ్చినట్టు తెలుస్తోంది.
ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కొరకు రూ.2.5 కోట్లు కలెక్ట్ చేయాలి. 2వ రోజు నుండీ పికప్ అయ్యి, దసరా హాలిడేస్ ను గట్టిగా క్యాష్ చేసుకుంటే బ్రేక్ ఈవెన్ సాధించే అవకాశాలు ఉన్నాయి.













