గరుడ వేగ ఫస్ట్ వీకెండ్ కలక్షన్స్!

రెండేళ్ల తర్వాత యాంగ్రీ యంగ్ మ్యాన్ డాక్టర్ రాజశేఖర్ థియేటర్లోకి వచ్చినప్పటికీ ఆదరణ తగ్గలేదు. ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో ఆయన నటించిన యాక్షన్ ఎంటర్‌టైన‌ర్ “పి.ఎస్.వి గరుడ వేగ 125.18” శుక్రవారం రిలీజ్ అయి మంచి స్పందన అందుకుంది. అత్యధిక బడ్జెట్ తో తెరకెక్కిన ఈ మూవీ తెలుగు రాష్ట్రాల్లో దాదాపు 230 థియేటర్స్ లో రిలీజై తొలి రోజు రోజు 2.30 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. జ్యో స్టార్ ఎంటర్ ప్రైజెస్ బ్యానర్ పై కోటేశ్వర రాజు, మురళి శ్రీనివాస్ నిర్మించిన ఈ సినిమా తొలిరోజు రికార్డ్ కలెక్షన్స్ రాబట్టడంతో మరిన్ని థియేటర్స్ లో ఈ మూవీని రిలీజ్ చేశారు. దీంతో కలక్షన్స్ పెరిగాయి. “గరుడవేగ” వీకెండ్ (మూడురోజుల్లో) 4.25 కోట్ల గ్రాస్రాబట్టింది. ఏరియాల వారీగా షేర్, గ్రాస్ వివరాలు ..

నైజాం : 95 లక్షలు
వైజాగ్ : 30 లక్షలు
తూర్పు గోదావరి : 20 లక్షలు
పశ్చిమ గోదావరి : 11 లక్షలు
కృష్ణా : 19 లక్షలుగుంటూరు : 24 లక్షలు
నెల్లూరు : 6 లక్షలు
సీడెడ్ : 30 లక్షలు
ఏపీ-తెలంగాణ షేర్ : 2.35 కోట్లు (గ్రాస్ : 4.25 కోట్లు)
కర్ణాటక : 15 లక్షలుయుఎస్ : 60 లక్షలు
ఇతర ప్రాంతాల్లో : 10 లక్షలు
వరల్డ్ వైడ్ షేర్ : 3.2 కోట్లు (గ్రాస్ : 6.65 కోట్లు)

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus