Bigg Boss 7 Telugu: శివాజీపై స్కెచ్ వేసిన గౌతమ్..! తెర వెనుక ఏం జరిగిందో తెలుసా ?

బిగ్ బాస్ హౌస్ లో వీకెండ్ షోకి ఉన్న డిమాండ్ అంతా ఇంతా కాదు. హౌస్ లో ఏం జరిగినా కూడా వీకెండ్ తేల్చుకుందాం అని, హోస్ట్ తోనే అమీ తూమీ మాట్లాడదామని సిద్ధమైపోతారు హౌస్ మేట్స్. అయితే, ఈసారి సీజన్ లో హౌస్ మేట్స్ శివాజీ ట్రాప్ లో ఈజిగా చిక్కేస్తున్నారు. ఆల్ ఆఫ్ బాల్ టాస్క్ లో బాల్స్ ని దాచే క్రమంలో శివాజీ ఎన్నో మాటలు అన్నాడు. దొంగతనం చేస్తే తోలు తీస్తా, తొక్కతీస్తా అన్నాడు. అంతేకాదు, అది అన్ ఫైయిర్ గేమ్ అని కూడా తేజకి, గౌతమ్ కి క్లాస్ పీకాడు. దీంతో వాళ్లు స్ట్రాటజీలు మార్చుకున్నారు.

నిజానికి దొంగతనం చేయడానికి పూర్తి స్కెచ్ వేశారు. కానీ, శివాజీ మాటలకి – స్ట్రాటజీకి బలైపోయారు. ఈవిషయంలో గౌతమ్ – తేజ ఇద్దరూ అమీ తుమీ తేల్చుకునేందుకు వీకెండ్ రెడీ అయ్యారు. అంతేకాదు, ఈవారం తన కెప్టెన్సీ టాస్క్ లో ఫస్ట్ రౌండ్ లోనే అవుట్ చేద్దామని మ్యాచ్ ఫిక్సింగ్ చేస్కున్నారని గౌతమ్ అన్నాడు. ముఖ్యంగా శివాజీ ఇంట్లో వాళ్లని ఇన్ఫులెన్స్ చేస్తున్నాడని, ఒక్కొక్కరి దగ్గరకి వెళ్లి మరీ చెప్పాడని గౌతమ్ అపోహ పడ్డాడు. అంతేకాదు, అశ్విని నీ మీదనే కన్నేశాడని, నువ్వు టార్గెట్ అని చెప్పింది. ఇక గౌతమ్ కూడా శివాజీ తన బదులు ఆడితే ఖచ్చితంగా గేమ్ దొబ్బేట్టేస్తాడని సీన్ అర్దమైంది.

అందుకే, అశ్విని గౌతమ్ తరపున గేమ్ ఆడింది. ఈనేపథ్యంలో వీకెండ్ ఎపిసోడ్ ఇంట్రస్టింగ్ గా మారింది. గౌతమ్ కి శివాజీకి మద్యలో నాగార్జున ఎలాంటి తీర్పు ఇస్తాడా అనే ఆసక్తి బిగ్ బాస్ లవర్స్ లో మొదలైంది. దీంతో ఈవారం నాగార్జున గౌతమ్ కి పిచ్చ క్లారిటీ ఇచ్చారు. నిజానికి గౌతమ్ కన్ఫెషన్ రూమ్ లోకి వచ్చి శివాజీకి స్కెచ్ గీశాడు. ఆయన అందరన్నీ ఇన్ఫలెన్స్ చేసి గేమ్ ని స్పాయిల్ చేస్తున్నాడని, మెత్తగా మాటలని స్టైడ్ చేసేస్తూ ఎలా పడితే అలా మాట్లాడుతున్నాడని అందుకే మేము గేమ్ ఆడలేకపోతున్నామని చెప్పాడు. దీనికి ప్రధానమైన కారణం అశ్విని చెప్పిన మాటలే.

ఈవిషయం అర్దమై నాగార్జున పంచాయితీని హౌస్ మేట్స్ ముందర పెట్టాడు. దీంతో గౌతమ్ ఇండివెడ్యువల్ గా వెళ్లి భోలేని స్వాప్ చేసిన పద్దతిని హౌస్ మేట్స్ తన టీమ్ మెంబర్స్ బయటపెట్టారు. దీంతో ఏదైతే శివాజీపై నిందవేశాడో అది తన విషయంలో నిజం అయిపోయింది. గ్రూప్ డెసీషన్ లో శివాజీ మాటలకి టీమ్ మెంబర్స్ ఎవ్వరూ ఇన్ఫులెన్స్ అవ్వలేదని టీమ్ మెంబర్స్ తేల్చి చెప్పేశారు. గౌతమ్ ని తీసేయడం గ్రూప్ డెసీషన్ అని అన్నారు. అలాగే, కెప్టెన్స్ అయిన అర్జున్, యావర్ ఇద్దరి నీ కూడా తీసేద్దామనే డిస్కషన్స్ వచ్చినాయి అని అమర్ చెప్పాడు.

గౌతమ్ ని నాగార్జున ప్రతి విషయంలోనూ లాక్ చేశారు. అసలు అన్యాయం జరిగింది యావర్ కి అని, నీ బదులు అశ్విని ఆడింది కానీ, యావర్ బదులు అస్సలు ఎవ్వరూ ఆడలేదనే క్లారిటీని గౌతమ్ కి ఇచ్చారు. ఇక బిగ్ బాస్ టీమ్ తెరవెనుక నుంచీ కొన్ని పాయింట్స్ అయితే గౌతమ్ కి సీక్రెట్ రూమ్ లోకి వెళ్లినపుడు చెప్పి పంపించారా అన్నట్లుగానే ఉంది. అంతేకాదు, అప్పట్నుంచీ గౌతమ్ శివాజీని టార్గెట్ చేయడం స్టార్ట్ చేశాడని అంటున్నారు. మరి వీళ్లిద్దరి పంచాయితీ ఇక్కడితే అయినట్లేనా, లేదా 10వ వారం నామినేషన్స్ (Bigg Boss 7 Telugu)  లో కూడా కొనసాగుతుందా లేదో అనేది చూడాలి. అదీ మేటర్.

మా ఊరి పొలిమేర 2 సినిమా రివ్యూ & రేటింగ్!

కీడా కోలా సినిమా రివ్యూ & రేటింగ్!
నరకాసుర సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Bigg Boss Telugu Update. Get Filmy News LIVE Updates on FilmyFocus