The Raja Saab: ప్రీమియర్స్ కు పర్మిషన్ డౌటే.. ఎందుకంటే?

ప్రభాస్ సినిమా అంటేనే హడావిడి మామూలుగా ఉండదు. రాజా సాబ్ సంక్రాంతికి వస్తోంది. జనవరి 9న రిలీజ్ డేట్ ఫిక్స్ అయితే, నిర్మాత విశ్వప్రసాద్ మాత్రం ఒకడుగు ముందుకేసి జనవరి 8నే ప్రీమియర్స్ ఉంటాయని ఈమధ్య సాంగ్ లాంచ్ లో బాంబ్ పేల్చారు. ఫ్యాన్స్ కు ఇది గుడ్ న్యూస్ అయినా, దీని వెనుక అసలు కథ వేరే ఉంది. నిజంగా ప్రభుత్వం దీనికి ఒప్పుకుంటుందా అనేదే ఇప్పుడు పెద్ద డౌట్.

The Raja Saab

తెలంగాణలో ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రీమియర్స్ కు పర్మిషన్ దొరకడం అంత సులువు కాదు. సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి గారు ఈ మధ్యే చాలా సీరియస్ గా వార్నింగ్ ఇచ్చారు. టికెట్ రేట్లు పెంచమని గానీ, స్పెషల్ షోల కోసం గానీ తమ దగ్గరకు రావద్దని తేల్చి చెప్పారు. సామాన్యుడికి సినిమా దూరం కాకూడదని ప్రభుత్వం గట్టిగా భావిస్తోంది. ఇలాంటి టైమ్ లో రాజా సాబ్ టీమ్ ప్రీమియర్స్ ప్లాన్ చేయడం నిజంగా సాహసమే.

ఇటీవల బాలయ్య ‘అఖండ 2’ విషయంలో ఏం జరిగిందో చూశాం. ప్రభుత్వం జీవో ఇచ్చినా, కోర్టు దాన్ని తప్పుబట్టింది. ఇష్టారాజ్యంగా రేట్లు పెంచితే కుదరదని హైకోర్టు మొట్టికాయలు వేసింది. దీంతో ప్రీమియర్స్, బెనిఫిట్ షోల విషయంలో నిర్మాతలకు పెద్ద షాక్ తగిలింది. ఇప్పుడు రాజా సాబ్ కు కూడా అదే సీన్ రిపీట్ అయ్యే ఛాన్స్ ఉంది.

నిర్మాత మాత్రం చాలా నమ్మకంతో అనౌన్స్ చేశారు. బహుశా ఏదైనా హామీ ఉందేమో తెలియదు కానీ, సర్కార్ నుంచి క్లియరెన్స్ రాకపోతే మాత్రం ఫ్యాన్స్ ఆశలు ఆవిరి అవ్వాల్సిందే. హైదరాబాద్ లో ఎర్లీ ప్రీమియర్స్ పడితే ఆ ఓపెనింగ్స్ లెక్క వేరుగా ఉంటుంది. కానీ ఇప్పుడు ప్రభుత్వం, కోర్టు రూల్స్ దీనికి అడ్డుపడేలా కనిపిస్తున్నాయి. మొత్తానికి జనవరి 8న షోలు పడతాయా లేదా అనేది ఇప్పుడు సస్పెన్స్ గా మారింది. ప్రభాస్ రేంజ్ సినిమా కాబట్టి ఏమైనా మినహాయింపు ఇస్తారా, లేక రూల్స్ అందరికీ ఒక్కటే అంటారా అనేది చూడాలి.

 

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus