Pushpa 3: ఆ అస్త్రం ఇప్పుడే వద్దు.. బన్నీ, సుకుమార్ సీక్రెట్ ప్లాన్

‘పుష్ప 2’ బాక్సాఫీస్ దగ్గర సృష్టించిన సునామీ అంతా ఇంతా కాదు. ఏకంగా రూ. 1700 కోట్లు కొల్లగొట్టి ఇండస్ట్రీ రికార్డులను తిరగరాసింది. క్లైమాక్స్ లో లీడ్ ఇచ్చారు కాబట్టి వెంటనే ‘పుష్ప 3’ ఉంటుందని అందరూ ఫిక్స్ అయ్యారు. కానీ సుకుమార్, బన్నీ ఆలోచన వేరేలా ఉంది. బంగారు బాతు లాంటి సీక్వెల్ ను పక్కన పెట్టి, ఓ కొత్త సినిమా చేయడానికి రెడీ అవుతున్నారు.

Pushpa 3

ఇండస్ట్రీ టాక్ ప్రకారం.. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ లోనే వీరిద్దరూ ఓ ఫ్రెష్ సబ్జెక్ట్ తో సినిమా చేయబోతున్నారు. పుష్ప ప్రపంచానికి సంబంధం లేని ఒక యునీక్ యాక్షన్ డ్రామాగా ఇది ఉండబోతోందట. బన్నీని ఇప్పటివరకు చూడని కొత్త అవతారంలో చూపించాలని సుకుమార్ స్కెచ్ వేశారు. రామ్ చరణ్ సినిమా పూర్తవ్వగానే ఈ కొత్త ప్రాజెక్ట్ పట్టాలెక్కే ఛాన్స్ ఉంది.

అయితే చేతిలో రెడీగా ఉన్న ‘పుష్ప 3’ని ఎందుకు హోల్డ్ లో పెట్టారు అనే దానికి ఒక బలమైన కారణం ఉంది. మేకర్స్ దృష్టిలో ‘పుష్ప 3’ అనేది ఒక ‘బ్రహ్మాస్త్రం’. కెరీర్ అన్నాక ఎప్పుడూ ఒకేలా ఉండదు. హిట్లు, ప్లాపులు కామన్. ఒకవేళ భవిష్యత్తులో బన్నీకి గానీ, సుకుమార్ కు గానీ వరుస ప్లాపులు వచ్చి మార్కెట్ డల్ అయితే.. అప్పుడు ఈ అస్త్రాన్ని బయటకు తీస్తారు.

పుష్ప బ్రాండ్ కు ఉన్న క్రేజ్ వల్ల సినిమా ఎలా ఉన్నా ఓపెనింగ్స్ కుమ్మేస్తాయి. మినిమం వెయ్యి కోట్లు గ్యారంటీ. అందుకే క్లిష్ట పరిస్థితుల్లో వాడుకోవడానికి దీన్ని రిజర్వ్ లో ఉంచారట. సేఫ్ జోన్ లో ఉన్నప్పుడు కొత్త ప్రయోగాలు చేసి, రిస్క్ లో ఉన్నప్పుడు ఈ బ్రహ్మాస్త్రాన్ని వాడాలనేది వీరి మాస్టర్ ప్లాన్.

 

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus