Bigg Boss 7 Telugu: శివాజీపై కోపంతో నోరుజారిన గౌతమ్..! ఏమన్నాడంటే.,

బిగ్ బాస్ హౌస్ ప్రస్తుత సీజన్ లో కూడా కొన్ని బూతులు వినిపిస్తున్నాయి. వీటికి బీప్స్ వేస్తూ కవర్ చేస్తున్నాడు బిగ్ బాస్. నిజానికి బిగ్ బాస్ హౌస్ లో అన్ని సీజన్స్ లో కూడా కొన్ని రకాలైన బూతులు వినిపిస్తునే వచ్చాయి. ప్రస్తుతం సీజన్ లో కూడా పార్టిసిపెంట్స్ ఫ్రస్టేషన్ లో బూతులు మాట్లాడేస్తున్నారు. 4వ వారం నామినేషన్స్ లో గౌతమ్ ప్రిన్స్ ని ఇంకా టేస్టీ తేజని నామినేట్ చేస్తూ రీజన్స్ చెప్పాడు. గౌతమ్ చెప్పిన రీజన్స్ జ్యూరీ మెంబర్స్ కి సిల్లీగా అనిపించాయి.

అదే విషయంలో శివాజీతో సీరియస్ గా ఆర్గ్యూమెంట్ అయ్యింది. ప్రిన్స్ ని వెనకేసుకుని వస్తున్నాడని గౌతమ్ కి అర్ధం అయ్యింది. అదే విషయం చెప్పాడు. కానీ, జ్యూరీ మెంబర్స్ నుంచీ రీజన్ యాక్సెప్ట్ అవ్వడం లేదు. దీంతో ఫ్రస్టేషన్ లో శివాజీపై నువ్వెంత అంటూ అరుస్తూ వెళ్లాడు. ఇలా అరుస్తూ ప్రిన్స్ వస్తాడని, పర్సనల్ గా నేను తీస్కోలేకపోతున్నా, హర్ట్ అవుతున్నా అని ప్రాక్టికల్ గా చేసి చూపించాడు. అయినా కూడా వాలిడ్ రీజన్ కావట్లేదని అనడంతో తిక్కరేగింది.

తను పట్టుకున్న గొడుగు పారేసి ప్రిన్స్ నామీదకి వస్తుంటే నాకు గు* లో మండుతుందని బూతు మాట్లాడాడు. దీనికి జ్యూరీ మెంబర్స్ అందరూ నోరు అదుపులో పెట్టుకోమని వార్నింగ్ ఇచ్చాడు. అంతేకాదు, ఇక్కడే గౌతమ్ ఫ్రస్టేట్ అయిపోయి నేను ఎవరిపై ఎంత కోపంగా ఉన్నా కూడా మళ్లీ డాక్టర్ గా వచ్చి సేవలు చేస్తానని , నన్ను వాడుకుంటున్నారని కూడా అన్నాడు. దీనిని కూడా జ్యూరీ మెంబర్స్ ఖండించారు. ఇక బిగ్ బాస్ హౌస్ లో రెండోవారం టాస్క్ లో అమర్ ని పల్లవి ప్రసాంత్ తప్పించినందుకు రెచ్చిపోయి అరిచాడు.

ఫ్రస్టేషన్ లో బాత్రూమ్ లోకి వెళ్లి వాడి వల్ల నా గేమ్ మ* గుడిసి పోయిందని గట్టిగా అరిచాడు. అప్పుడు కూడా హౌస్ మేట్స్ అమర్ కి నోరు అదుపులో పెట్టుకోమని చెప్పారు. అలాగే, 3వ వారం నామినేషన్స్ అప్పుడు పల్లవి ప్రశాంత్ థామినిని నామినేట్ చేస్తూ , నువ్వు F* అనే పదం వాడావని అది నాకు నచ్చలేదని రీజన్ చెప్పాడు. ఈ రీజన్ తోనే తను హౌస్ నుంచీ ఎలిమినేట్ అవ్వాల్సి వచ్చింది. ఇలా ఈ సీజన్ లో (Bigg Boss 7 Telugu) బూతులు ఎక్కువైపోయాయి. మరి వీటిపైన వీకెండ్ నాగార్జున ఎలా స్పందిస్తాడు అనేది ఆసక్తికరం.

‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ ప్రియాంక జైన్ గురించి 10 ఆసక్తికర విషయాలు..!

‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ దామిని భట్ల గురించి 10 ఆసక్తికర విషయాలు!
‘బిగ్ బాస్ 7’ 14 మంది కంటెస్టెంట్స్ పారితోషికాల లిస్ట్..!

Read Today's Latest Bigg Boss Telugu Update. Get Filmy News LIVE Updates on FilmyFocus