విజయ్ దేవరకొండ, రష్మిక మందన జంటగా నటించిన బ్లాక్ బస్టర్ చిత్రం ‘గీత గోవిందం’. పరశురామ్(బుజ్జి) డైరెక్ట్ చేసిన ఈ చిత్రాన్ని ‘జిఏ2 పిక్చర్స్’ బ్యానర్ పై బన్నీ వాస్ నిర్మించాడు. 2018 ఆగష్ట్ 15 విడుదలైన ఈ చిత్రం సూపర్ హిట్ గా నిలిచింది. ‘అర్జున్ రెడ్డి’ చిత్రంతో మంచి ఫామ్లో ఉన్న విజయ్ దేవరకొండను స్టార్ హీరోని చేసింది ఈ చిత్రం.
ఈరోజుతో ఈ చిత్రం విడుదలయ్యి రెండేళ్లు పూర్తి కావస్తున్న తరుణంలో ఫైనల్ గా ఎంత కలెక్షన్స్ ను రాబట్టిందో ఓ లుక్కేద్దాం రండి :
నైజాం | 20.52 cr |
సీడెడ్ | 7.02 cr |
వైజాగ్ | 6.06 cr |
ఈస్ట్ | 4.01 cr |
వెస్ట్ | 3.19 cr |
కృష్ణా | 3.76 cr |
గుంటూరు | 3.75 cr |
నెల్లూరు | 1.74 cr |
ఏపీ + తెలంగాణ | 50.05 cr |
కర్ణాటక | 6.08 cr |
రెస్ట్ ఆఫ్ ఇండియా | 1.05 cr |
తమిళనాడు | 2,13 cr |
రెస్ట్ ఆఫ్ వరల్డ్ | 2.53 cr |
యూ.ఎస్.ఏ | 2.53 cr |
వరల్డ్ వైడ్ టోటల్ | 70.60 cr (Share) |
‘గీత గోవిందం’ చిత్రానికి వరల్డ్ వైడ్ గా 15 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది.ఫుల్ రన్ ముగిసే సరికి ఈ చిత్రం వరల్డ్ వైడ్ గా 70.60 కోట్ల షేర్ ను వసూల్ చేసింది. అంటే 55 కోట్ల వరకూ లాభాల్ని మిగిల్చిందని చెప్పొచ్చు. ఇక గ్రాస్ పరంగా చూసుకుంటే 130 కోట్లను కొల్లగొట్టింది ఈ చిత్రం.