బన్నీ ఫామ్ హౌస్ లో గీత గోవిందం సక్సెస్ సెలబ్రేషన్స్

మహేష్ బాబు, ఎన్టీఆర్, రామ్ చరణ్ ఎప్పట్నుంచి అయితే “మేమందరం ఒక్కటే” అని ప్రూవ్ చేయడం మొదలెట్టారో.. అప్పట్నుంచి ఫ్యాన్ వార్స్ తగ్గాయి. ఇదే మంచిది అనుకున్న స్టార్ హీరోలందరూ వరుసబెట్టి ఏదో ఒక ఈవెంట్ లో కలిసి కనిపిస్తూ వచ్చారు. యువ హీరోలు, సీనియర్ హీరోలు అన్న డిఫరెన్స్ అనేది చాలావరకూ పోయింది. అందుకే ఇప్పుడు అల్లు అర్జున్ కూడా తన కాంపౌండ్ నుంచి వచ్చిన సినిమాతో సూపర్ హిట్ అందుకొన్న విజయ్ దేవరకొండకి సపోర్ట్ చేస్తూ తన మంచితనాన్ని చాటుకొంటున్నాడు. “గీత గోవిందం” చిత్రం ప్రీరిలీజ్ ఈవెంట్ కి ముఖ్య అతిధిగా హాజరైన అల్లు అర్జున్ అప్పుడే విజయ్ దేవరకొండకి తన ఫుల్ సపోర్ట్ ఉంటుందని చెప్పాడు.

బుధవారం విడుదలైన “గీత గోవిందం” సూపర్ హిట్ గా నిలిచి ఆల్రెడీ బ్రేక్ ఈవెన్ కూడా అవ్వడంతో బన్నీ అండ్ టీం షాక్ అయ్యారట. ఇప్పటివరకు నాని, సాయిధరమ్ తేజ్, నితిన్ ల సినిమాలు కూడా మూడు రోజుల్లో బ్రేకీవెన్ అవ్వలేదు. అలాంటిది విజయ్ దేవరకొండ ఆ రేర్ ఫీట్ ను హీరోగా తన మూడో సినిమాతోనే సాధించడంతో అల్లు అర్జున్ సంభ్రమాశ్చర్యానికి గురయ్యాడట. అందుకే విజయ్ దేవరకొండ అండ్ టీం కి ఇవాళ రాత్రి తన ఫామ్ హౌస్ లో పెద్ద పార్టీ ఎరేంజ్ చేశాడట. ఈ పార్టీకి రామ్ చరణ్ కూడా రానున్నాడని వినికిడి. ఇలాగే హీరోలందరూ తన-మన బేధం లేకుండా కలిసిపోతే ఇండస్ట్రీ భలే నిండుగా ఉంటుంది కదూ.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus