Geethu Royal: చిత్తూరులో సందడి చేసిన బిగ్ బాస్ కంటెస్టెంట్ గీతూ రాయల్!

బిగ్ బాస్ 6 కంటెస్టెంట్ గా చిత్తూరు చిరుతగా పేరు సంపాదించుకున్న గీతూ రాయల్ ఈ కార్యక్రమంలోకి అడుగుపెట్టి ఈ కార్యక్రమం ద్వారా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. చిత్తూరు యాసలో మాట్లాడుతూ బిగ్ బాస్ రివ్యూయర్ గా,పలువురు సెలబ్రిటీలను ఇంటర్వ్యూ చేస్తూ ఎంతో ఫేమస్ అయినటువంటి ఈమె బిగ్ బాస్ కార్యక్రమంలో టాప్ ఫైవ్ కంటెస్టెంట్ గా ఉంటుందని అందరూ భావించారు. అయితే అనూహ్యంగా గీతూ తొమ్మిదవ వారంలోనే హౌస్ నుంచి ఎలిమినేట్ అయ్యారు.

తాజాగా చిత్తూరులో జరిగిన తానా చైతన్య స్రవంతి కార్యక్రమాన్ని ఎంతో అట్టహాసంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి గీతూ హాజరై చిత్తూరులో సందడి చేశారు.ఇలా ఈమె చిత్తూరులో సందడి చేయడంతో పెద్ద ఎత్తున అభిమానులు ఈమెతో సెల్ఫీలు దిగడం కోసం ఎగబడ్డారు. ఈ కార్యక్రమంలో భాగంగా గీతూ మాట్లాడుతూ… మీ అభిమానం చూస్తుంటే నా వల్ల కావడం లేదురా నాయనా… నేను చిత్తూరు వదిలి వెళ్ళిపోయి 15 సంవత్సరాలు అయినా చిత్తూరు యాసను నా బ్లడ్ లో ఎక్కించుకున్నాను.

ఏసందర్భంలో అయినా కూడా తాను చిత్తూరు యాసలోనే మాట్లాడుతున్నానని ఇక మీది ఏ ఊరు అని నన్ను ఎవరైనా ప్రశ్నిస్తే చిత్తూరు రా అంటూ గర్వంగా చెప్పుకుంటానని ఈమె తెలిపారు. ఇక ఈ వేదికపై బిగ్ బాస్ కార్యక్రమం గురించి కూడా మాట్లాడుతూ తాను బిగ్ బాస్ కార్యక్రమానికి వెళ్లిన తర్వాత రెండు విషయాలు నేర్చుకున్నానని తెలిపారు. ఒకటి మనం తప్పు చేయకపోతే మన ముందు ఎలాంటి తోపు ఉన్న అసలు తగ్గకూడదు.

మన వైపు తప్పు ఉంటే చిన్నపిల్లల నైనా క్షమాపణలు అడగాలి… జీవితాంతం చిత్తూరు ప్రజలకు రుణపడి ఉంటా అంటూ ఈ సందర్భంగా గీతూ రాయల్ చేసినటువంటి ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

18 పేజెస్ సినిమా రివ్యూ& రేటింగ్!
ధమకా సినిమా రివ్యూ& రేటింగ్!

ఈ ఏడాది ఓవర్సీస్ లో 1 మిలియన్ కొట్టిన సినిమాల లిస్ట్..!
టాప్ 10లో తెలుగు ఇండస్ట్రీ నుండి ఎన్ని సినిమాలు ఉన్నాయంటే..?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus