Salaar: సలార్ ప్లాప్ అనుకున్నాను అంటూ షాకింగ్ కామెంట్స్ చేసిన గీతూ?

పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ నటించినటువంటి సలార్ సినిమా ఎన్నో అంచనాల నడుమ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇక ఈ సినిమా బెనిఫిట్ షో నుంచి కూడా అద్భుతమైనటువంటి టాక్ సొంతం చేసుకుని దూసుకుపోతుంది. ఇక ఈ సినిమా ఎంతో మంచి సక్సెస్ కావడంతో ప్రభాస్ అభిమానులు ఎంతో సంబరం వ్యక్తం చేస్తున్నారు. ఇకపోతే తాజాగా ఈ సినిమా గురించి గలాట గీతు రాయల్ చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

ఈ సందర్భంగా గీతూ ఈ సినిమా రివ్యూ ఇస్తూ ఈ సినిమా నాకేమీ అర్థం కాలేదు అంటూ కామెంట్ చేశారు. దీంతో ప్రభాస్ ఫ్యాన్స్ ఈమెపై ఓరెంజ్ లో కామెంట్స్ చేస్తున్నారు. ఈ సినిమాకు గీతూ రివ్యూ ఇస్తూ.. సలార్ సినిమా ఫ్లాప్ అవుతుందని నేను అనుకున్నాను ఈ సినిమా కూడా ఫ్లాపేనా అని ఫీల్ అయ్యాను దాంతో బెనిఫిట్ షోకే వెళ్లి సినిమా చూసానని ఈమె తెలియజేశారు. ప్రభాస్ కటౌట్ ఈ సినిమాలో అదిరిపోయిందని ఈమె తెలిపారు.

కానీ ఈ సినిమా మాత్రం నాకు అర్థం కాలేదు ఇందులో వచ్చే ఫైట్ సీన్స్ అలాగే ట్విస్టులు నాకు అర్థం కాలేదని నాకు బుర్ర తక్కువ ఉండడంతో ఈ సినిమా అర్థం కాలేదేమో తెలియదు కానీ ఒకసారి సినిమా చూస్తే అర్థం కాదని ఈ సినిమా అర్థం కావాలి అంటే మరోసారి కూడా చూడాలి అంటూ ఈ సందర్భంగా ఈమె ఈ సినిమాకు రివ్యూ ఇవ్వడంతో పలువురు ఈమెపై ట్రోల్ చేస్తున్నారు.

మామూలుగా ఇస్తే తన రివ్యూ ఎవరు చూడరని బహుశా ఇలా ఇచ్చావా ఏంటి గీతక్క అంటూ కొందరు కామెంట్లు చేస్తున్నారు. ఇక ఈ రెండు రోజుల కాలంలో గీతూ పెద్ద ఎత్తున వార్తల్లో నిలిచారు. బిగ్ బాస్ కార్యక్రమం గ్రాండ్ ఫినాలే రోజు కొంతమంది ఈమె కారును కూడా పగలగొట్టడంతో ఈమె పెద్ద ఎత్తున ఆగ్రహం వ్యక్తం చేస్తూ పోలీస్ కేసు కూడా నమోదు చేసిన సంగతి తెలిసిందే.

సలార్ సినిమా రివ్యూ & రేటింగ్!

డంకీ సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిల్లా- రంగా’ టు ‘సలార్’… ఫ్రెండ్షిప్ బ్యాక్ డ్రాప్లో రూపొందిన 10 సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus