Adipurush: ‘ఆదిపురుష్’ అప్డేట్ కు రంగం సిద్దమైనట్టే..!

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ‘రాధే శ్యామ్’ చిత్రంతో పాటు మరో 3 సినిమాలను కూడా అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. ‘రాధే శ్యామ్’ తుది దశకు చేరుకుంది. మరో పక్క ఓం రౌత్ డైరెక్షన్లో ‘ఆదిపురుష్’ మరియు ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో ‘సలార్’ వంటి చిత్రాల్లో కూడా నటిస్తూ బిజీగా గడుపుతున్నాడు ప్రభాస్. అయితే ఇప్పుడు కరోనా సెకండ్ వేవ్ కారణంగా ఈ 3 సినిమాల షూటింగ్ లు ఆగిపోయాయి. దాంతో ఈ ఏడాది కూడా ప్రభాస్ అభిమానులు అప్డేట్స్ తోనే కాలం గడపాల్సిన పరిస్థితి ఏర్పడేలా ఉంది.

ఇదిలా ఉండగా.. గత నాలుగైదు రోజుల నుండీ ‘ఆదిపురుష్’ పెద్ద ఎత్తున ట్రెండ్ అవుతుంది. దాంతో ఈ సినిమా నుండీ ఏమైనా అప్డేట్ రానుందా అనే ప్రశ్నలు కూడా తలెత్తుతున్నాయి. మే నెల మొత్తం ‘ఆదిపురుష్’ కు ప్రభాస్ డేట్స్ ఇచ్చాడు. మేకర్స్ కూడా లాంగ్ షెడ్యూల్ ను ప్లాన్ చేశారు. కానీ ఇప్పుడు ఆ షెడ్యూల్ నిర్వహించే ఆలోచనే ‘ఆదిపురుష్’ టీం కు లేదని ఇన్సైడ్ టాక్. అయితే ‘ఆదిపురుష్’ ఇప్పటికే 30 శాతం షూటింగ్ పార్ట్ ను కంప్లీట్ చేసుకుందట.

దాంతో ఏప్రిల్ 21న శ్రీరామనవమి పండుగ ఉంది కాబట్టి.. ఏదో ఒక అప్డేట్ ఇవ్వాలని దర్శకుడు ఓం రౌత్ భావిస్తున్నాడట. ఇప్పటి వరకూ ‘ఆది పురుష్’ కు సంబంధించిన ప్రతీ అప్డేట్ ను ఉదయం 7:11 నిమిషాలకే ఇస్తూ వచ్చారు. ఈసారి కూడా అదే విధంగా రేపు ఉదయం అప్డేట్ ఇవ్వాలనే ప్రయత్నాలు మొదలయ్యాయట.

Most Recommended Video

‘పవన్ కళ్యాణ్’ హీరోగా రూపొందిన 11 రీమేక్ సినిమాలు మరియు వాటి ఫలితాలు..!
పెళ్లయ్యి కూడా పెళ్లి కానట్టు ఉండే 10 మంది టాలీవుడ్ భామల లిస్ట్..!
ఈ 10 మంది టాలీవుడ్ హీరోలకి బిరుదులు మార్చిన సినిమాల లిస్ట్..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus