Ghaati Censor Report: ఘాటి సెన్సార్ రివ్యూ

అనుష్క ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ‘ఘాటి’ సినిమా సెన్సార్ టాక్ బయటికొచ్చింది. డైరెక్టర్ క్రిష్ జాగర్లమూడి తెరకెక్కించిన ఈ భారీ సినిమా, సెన్సార్ అడ్డంకులను దాటి రిలీజ్‌కు రెడీ అయింది. ‘ఘాటి’లో అనుష్క శెట్టి లీడ్ రోల్‌లో నటించింది. ఈ సినిమా తాజాగా సెన్సార్‌ను కంప్లీట్ చేసింది. ఈ చిత్రానికి సెన్సార్ బోర్డు ‘U/A’ సర్టిఫికెట్ ఇవ్వగా, సినిమా రన్‌టైమ్‌ను 2 గంటల 35 నిమిషాలకు (155 నిమిషాలు) లాక్ చేశారు. ఈ డ్యూరేషన్‌తో ప్రేక్షకులకు ఒక పర్ఫెక్ట్ ఎమోషనల్ అండ్ యాక్షన్ ప్యాకేజీ గ్యారెంటీ అనిపిస్తోంది.

Ghaati Censor Report

ఇండస్ట్రీ టాక్ ప్రకారం, ‘ఘాటి’ ప్రేక్షకులను రెండు డిఫరెంట్ జోన్స్‌లోకి తీసుకెళ్లనుంది. ఫస్టాఫ్ మొత్తం క్యారెక్టర్ల మధ్య డ్రామా, ఎమోషన్స్‌తో మనసును బరువెక్కిస్తూ ఒక షాకింగ్ ఇంటర్వెల్ ట్విస్ట్‌తో ఎండ్ అవుతుందట. సెకండాఫ్ మాత్రం పక్కా యాక్షన్ మోడ్‌లోకి షిఫ్ట్ అయి, అనుష్క పెర్ఫార్మెన్స్‌తో థియేటర్లు దద్దరిల్లిపోవడం ఖాయమని, క్రిష్ టేకింగ్ గూస్‌బంప్స్ తెప్పిస్తుందని చెబుతున్నారు.అరకు బ్యాక్‌డ్రాప్‌లో గంజాయి మాఫియా నేపథ్యంలో నడిచే ఈ కథలో అనుష్కతో పాటు విక్రమ్ ప్రభు, జగపతి బాబు, చైతన్య రావు, రవీంద్రన్ విజయ్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు.

సెన్సార్ షో చూసిన వారి మాటల ప్రకారం, ఎవరికీ తలవంచని పవర్‌ఫుల్ మహిళగా అనుష్క నటన సినిమాకే మెయిన్ హైలైట్ అని, ప్రేక్షకులను సీట్లలోంచి కదలనివ్వని థ్రిల్లింగ్ సీన్స్ చాలానే ఉన్నాయని టాక్ వినిపిస్తోంది. ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై రాజీవ్ రెడ్డి, సాయి బాబు జాగర్లమూడి ఈ చిత్రాన్ని నిర్మించగా, యూవీ క్రియేషన్స్ సమర్పిస్తోంది. ఈ సినిమాను తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో 2025, సెప్టెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.

ఇట్స్ అఫీషియల్… ‘అఖండ 2’ పోస్ట్ పోన్

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus