Ghani: ఆహా ఓటిటిలో విశేషాదరణ దక్కించుకుంటున్న గని..!

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా నటించిన ఏప్రిల్ 22 న ఆహా ఓటిటిలో విడుదలైంది. ఆహా వారు వినూత్నమైన కంటెంట్ తో ప్రేక్షకుల్ని అమితంగా ఆకట్టుకుంటున్న సంగతి తెలిసిందే. అలరించే టాక్ షోలు, వెబ్ సిరీస్ లు , డబ్బింగ్ సినిమాలు, స్ట్రెయిట్ మూవీస్ తో కన్నుల పండుగ వాతావరణాన్ని కలిగిస్తూ ఉంటుంది ఆహా. ప్రతీ శుక్రవారం ఓ సినిమా ఆహా లో విడుదలవుతుంది.ఈ క్రమంలో ఈ వారం ప్రేక్షకుల ఇళ్ళల్లోకి వచ్చింది.

Click Here To Watch NOW

నూతన దర్శకుడు కిరణ్ కొర్రపాటి తెరకెక్కించిన ఈ మూవీ బాక్సింగ్ నేపథ్యంలో ఓ స్పోర్ట్స్ డ్రామాగా రూపొందింది. ఈ మూవీ లో వచ్చే కిక్ బాక్సింగ్ ఎపిసోడ్స్ ప్రేక్షకుల్ని అమితంగా ఆకట్టుకుంటున్నాయి. చాలా మంది ఆ ఎపిసోడ్స్ ను రిపీటెడ్ గా చూస్తున్నట్టు సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు. మంచి ఫ్యామిలీ ఎమోషన్స్ , రివేంజ్ డ్రామా కూడా ఇందులో ఇమిడి ఉంది.

ఏప్రిల్ 8 న ఈ మూవీ థియేటర్లలో విడుదలైంది. ఆర్.ఆర్.ఆర్, కే.జి.ఎఫ్ 2 సినిమాల మధ్యలో రావడంతో ఈ మూవీని ఎక్కువ మంది చూడలేదు. అయితే ఆహా లో మాత్రం మంచి వ్యూయర్ షిప్ ను నమోదు చేస్తూ దూసుకుపోతుంది. ఉపేంద్ర, సునీల్ శెట్టి,జగపతి బాబు, నవీన్ చంద్ర, నదియా వంటి వారు కీలక పాత్రలు పోషించిన ఈ మూవీలో బాలీవుడ్ బ్యూటీ సాయి మంజ్రేకర్ హీరోయిన్ గా నటించింది. తమన్ ఈ సినిమాకి మంచి సంగీతాన్ని అందించాడు.

‘కె.జి.ఎఫ్2’ నుండీ అదిరిపోయే 23 డైలాగులు ఇవే..!

Most Recommended Video

‘ఆర్.ఆర్.ఆర్’ తో పాటు ఫస్ట్ వీక్ తెలుగు రాష్ట్రాల్లో భారీ వసూళ్ళను రాబట్టిన సినిమాల లిస్ట్..!
తెలుగులో అత్యధిక థియేట్రికల్ బిజినెస్ చేసిన సినిమాల లిస్ట్..!
‘ఆర్.ఆర్.ఆర్’ తో పాటు బాక్సాఫీస్ వద్ద భారీ లాభాలను అందించిన 10 సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus