విక్టరీ వెంకటేష్,దర్శకుడు గౌతమ్ వాసుదేవ్ మీనన్ కలయికలో రూపొందిన లవ్ అండ్ యాక్షన్ మూవీ ‘ఘర్షణ’. ‘గీత చిత్ర ఇంటర్నేషనల్’ బ్యానర్ పై జి.శివరాజు, సి.వెంకట రాజు లు సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమా తమిళంలో రూపొందిన ‘కాక కాక’ కి రీమేక్ అనే సంగతి తెలిసిందే. అయితే తెలుగు వెర్షన్ ను చాలా బాగా తీశారు గౌతమ్ మీనన్. అసలు రీమేక్ సినిమాలా కాకుండా ఇదే ఒరిజినల్ సినిమా అనే రేంజ్లో తెలుగులో తెరకెక్కించారు.
వెంకటేష్ మేకోవర్ యూత్ ను అమితంగా ఆకట్టుకుంది. హారిస్ జయరాజ్ సంగీతంలో రూపొందిన పాటలన్నీ చార్ట్ బస్టర్స్ అయ్యాయి. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా చాలా బాగుంటుంది.తెలుగులో కూడా మంచి విజయాన్ని సొంతం చేసుకున్న నేటితో 21 ఏళ్ళు పూర్తి చేసుకుంటుంది. ఈ సందర్భంగా టోటల్ కలెక్షన్స్ ను ఓ లుక్కేద్దాం రండి :
నైజాం | 4.40 cr |
సీడెడ్ | 2.95cr |
ఉత్తరాంధ్ర | 1.65 cr |
ఈస్ట్ | 0.86 cr |
వెస్ట్ | 0.72 cr |
గుంటూరు | 0.96 cr |
కృష్ణా | 0.83 cr |
నెల్లూరు | 0.52 cr |
ఏపీ+తెలంగాణ | 12.89 cr |
రెస్ట్ ఆఫ్ ఇండియా+ఓవర్సీస్ | 0.68 cr |
వరల్డ్ టోటల్ | 13.57 cr |
‘ఘర్షణ’ రూ.12 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగింది. మొదట మిక్స్డ్ టాక్ వచ్చినా.. తర్వాత బాగానే నిలబడింది. ఫైనల్ గా టార్గెట్ రీచ్ అయ్యి రూ.13.57 కోట్ల షేర్ ను కలెక్ట్ చేసింది.ఓవర్ ఆల్ గా బయ్యర్లకు రూ.1 కోటి వరకు మిగిల్చి క్లీన్ హిట్ గా నిలిచింది.