‘నిను వీడను నీడను నేనే’ చిత్ర యూనిట్ కు ఇది పెద్ద దెబ్బే..!

టాలీవుడ్ హీరో సందీప్ కిషన్ కు తాజాగా ‘జీహెచ్ఎంసీ’ అధికారులు పెద్ద షాకిచ్చారు. ఆయన హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘నిను వీడను నీడను నేనే’ జూలై 12 న (రేపు) విడుదల కానుంది. హీరోగానే కాకుండా సందీప్ ఈ చిత్రానికి నిర్మాణ బాధ్యతలు కూడా తీసుకున్నాడు. ఈ చిత్రానికి చేసిన ప్రమోషన్లు ఇప్పటి వరకూ సందీప్ కిషన్ నడిచిన మరే చిత్రానికి చేయలేదు. అందుకోసం మల్టీప్లెక్సుల్లో టాయిలెట్స్ ను కూడా విడిచిపెట్టలేదు. దీంతో పాటు సిటీ మొత్తం పోస్టర్లతో నింపేసాడు. ఇందులో భాగంగా మెట్రో పిల్లర్ల వద్ద వాల్ పోస్టర్లను ఏర్పాటు చేసాడు.

అయితే ఈ పోస్టర్లను జీహెచ్ఎంసీ అధికారులు తొలగించి పెద్ద షాకిచ్చారు. ‘ఈ సినిమా పోస్టర్లలో హీరో, హీరోయిన్లను అసభ్యంగా చూపించారంటూ’ ఉప్పల్ కు చెందిన కొంతమంది ప్రజలు అభ్యంతరం వ్యక్తం చేసారు. అక్కడితో ఆగకుండా ‘జీహెచ్ఎంసీ’ అధికారులకు కంప్లైంట్ కూడా ఇచ్చారు. దీంతో ఉప్పల్ మెట్రో పిల్లర్ల వద్ద ఏర్పాటు చేసిన సినిమా పోస్టర్లన్నిటినీ తొలగించారు. అయితే ‘జీహెచ్ఎంసీ’ అధికారుల తీరుపై చిత్రబృందం అసంతృప్తి వ్యక్తం చేస్తుంది. సినిమా ప్రమోషన్స్ నిమిత్తం ‘జీహెచ్ఎంసీ’ అధికారుల నుండీ అనుమతి తీసుకున్నామని.. అయినప్పటికీ పోస్టర్లు తొలగించేశారంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఈ టాపిక్ సోషల్ మీడియాలో తెగ వైరలవుతుంది. !

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus