Chiranjeevi: వెంకీ కుడుముల సూపర్‌ ఫాస్ట్‌ ప్లానింగ్‌ షురూ!

మెగా ఫ్యాన్‌తో మెగాస్టర్‌ సినిమా అంటూ ఇటీవల ఓ సినిమా అనౌన్స్‌ చేశారు. వెంకీ కుడుముల దర్శకత్వంలో మెగాస్టార్‌ చిరంజీవి నటిస్తున్న అనౌన్స్‌మెంట్‌ ఇది. డీవీవీ దానయ్య ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్‌ పనులు జోరుగా సాగుతున్నాయి. ఇటీవల కథ నెరేట్‌ చేసి వెంకీ ఓకే చేయించుకున్నారని టాక్. తాజాగా సినిమా కథానాయిక గురించి చర్చలు మొదలయ్యాయి. ఈ క్రమంలో గోవా బ్యూటీ పేరు చర్చల్లోకి వచ్చిందని టాక్‌.

Click Here To Watch

అవును మెగాస్టార్‌ సరసన ఇలియానా అయితే ఎలా ఉంటుందని చిత్రబృందం అనుకుంటోందట. రవితేజ ‘అమర్‌ అక్బర్‌ ఆంటోని’ సినిమాతో టాలీవుడ్‌లోకి రీఎంట్రీ ఇచ్చిన ఇలియానా… ఆ తర్వాత మళ్లీ నటించలేదు. ఇటీవల కాలంలో నాజూకు రూపం నుండి బొద్దుగుమ్మగా మారిపోయింది ఇలియానా. ఈ లుక్‌లో చిరంజీవి సరసన ఇలియానా బాగానే ఉంటుందని అనుకుంటున్నారట. దీంతో ఆమెను సినిమాకు అడుగుదామని చూస్తున్నారని టాక్‌. ఇంకొందరైతే ఇప్పటికే చర్చలు జరుగుతున్నాయనే అంటున్నారు. మరి ఇలియానా ఏమంటుంది అనేది తెలియాల్సి ఉంది.

ఇక ఈ సినిమా సంగతికొస్తే… ఈ సినిమాలో చిరంజీవి మాఫియా డాన్‌ పాత్రలో కనిపిస్తారని అంటున్నారు. అయితే ఈ డాన్‌… కాస్త ఎంటర్‌టైన్మంట్‌ జోనర్‌లో ఉంటాడని అంటున్నారు. ఓ ఫ్యాన్‌ చిరంజీవి సినిమా నుండి ఏమేం ఆశిస్తున్నారో అన్నీ ఈ సినిమాలో ఉండేలా చూస్తానని ఆ మధ్య వెంకీ కుడుముల అన్నారట. ఇప్పుడు అదే పనిలో ఉన్నారట. ఈ సినిమా కథపై వస్తున్న పుకార్లు నిజమైతే…చిరంజీవి ఇలాంటి పాత్రలో దగ్గర దగ్గర్లో చేస్తున్నట్లే.

ప్రస్తుతం చిరంజీవి నటిస్తున్న ‘లూసిఫర్‌’ రీమేక్‌ ‘గాడ్‌ఫాదర్‌’లో కూడా మాఫియా డాన్‌ తరహా పాత్రలోనే నటిస్తున్నాడు. మరి వెంటవెంటనే ఒకే లాంటి పాత్ర అంటే ఆలోచించాయి. అయితే మధ్యలో ఆ పాత్రకు రెండు సినిమాల గ్యాప్‌ ఉంటుంది అనుకోండి. ప్రస్తుతం చిరంజీవి లైనప్‌లో కొరటాల శివ ‘ఆచార్య’, మోహన్‌ రాజా ‘గాడ్ ఫాదర్, మెహర్‌ రమేశ్‌ ‘భోళాశంకర్’, బాబీ – మైత్రీ మూవీ మేకర్స్‌ సినిమా ఉన్నాయి. ఆ తర్వాతే వెంకీ కుడుముల సినిమా ఉంటుంది.

తమిళంలో సత్తా చాటిన తెలుగు సినిమాలు … టాప్ 10 లిస్ట్ ఇదే ..!

Most Recommended Video

బ్రహ్మానందం కామెడీతో హిట్టైన 10 సినిమాల లిస్ట్..!
సెలబ్రిటీ కపుల్స్ నయా ట్రెండ్.. ‘సరోగసీ’..!
చైసామ్, ధనుష్- ఐస్ లు మాత్రమే కాదు సెలబ్రిటీల విడాకుల లిస్ట్ ఇంకా ఉంది..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus