God Father: గాడ్ ఫాదర్ మూవీ సక్సెస్ సాధించినట్టే.. కానీ?

చిరంజీవి హీరోగా మోహన్ రాజా డైరెక్షన్ లో తెరకెక్కిన గాడ్ ఫాదర్ సినిమాపై భారీ స్థాయిలో అంచనాలు నెలకొన్నాయనే సంగతి తెలిసిందే. భారీ బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కగా ఈ సినిమా కచ్చితంగా సక్సెస్ ను సొంతం చేసుకుంటుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు. తాజాగా ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. సెన్సార్ సభ్యుల నుంచి ఈ సినిమాకు పాజిటివ్ టాక్ వినిపిస్తుండటం గమనార్హం. చిరంజీవి గత సినిమా ఆచార్య ఆశించిన స్థాయిలో సక్సెస్ ను సొంతం చేసుకోకపోయినా

గాడ్ ఫాదర్ సినిమాతో చిరంజీవి సక్సెస్ ను సొంతం చేసుకుంటారని ఫ్యాన్స్ భావిస్తున్నారు. సెన్సార్ సభ్యులు సైతం చిరంజీవి ఫ్యాన్స్ కోరుకునే అన్ని అంశాలు ఈ సినిమాలో ఉన్నాయని ఫ్యాన్స్ చెబుతున్నారు. సల్మాన్ ఖాన్, నయనతార, సత్యదేవ్ పాత్రలు ఈ సినిమాకు హైలెట్ గా నిలిచాయని సమాచారం. చిరంజీవి, సల్మాన్ కాంబో సీన్లు బాగున్నాయని బోగట్టా. ఈ సినిమాకు సెన్సార్ బోర్డ్ నుంచి యూ/ఏ సర్టిఫికెట్ వచ్చింది.

సినిమా అద్భుతంగా ఉందని సెన్సార్ సభ్యులు చిత్ర యూనిట్ కు చెప్పినట్టు బోగట్టా. తెలుగు, హిందీ భాషల్లో అక్టోబర్ 5వ తేదీన ఈ సినిమా థియేటర్లలో రిలీజ్ కానుంది. థమన్ బ్యాగ్రౌండ్ మ్యూజిక్ ఈ సినిమాకు ప్లస్ అయిందని తెలుస్తోంది. గాడ్ ఫాదర్ దసరా సమయంలో సినిమా చూడాలనుకునే ప్రేక్షకులకు ఫస్ట్ ఛాయిస్ గా నిలవనుంది.

ఒకేరోజున గాడ్ ఫాదర్, ది ఘోస్ట్ సినిమాలు థియేటర్లలో రిలీజ్ కానుండగా గాడ్ ఫాదర్ సినిమా కోసమే ఎక్కువ మంది ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు. మోహన్ రాజా ఈ సినిమాతో చిరంజీవి నమ్మకాన్ని కచ్చితంగా నిలబెట్టుకుంటారని ఫ్యాన్స్ భావిస్తున్నారు. సెన్సార్ టాక్ పాజిటివ్ గా ఉండటంతో పాటు చిరంజీవి ప్రమోషన్స్ లో వేగం పెంచడంతో ఈ సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి.

ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

శాకిని డాకిని సినిమా రివ్యూ & రేటింగ్!
నేను మీకు బాగా కావాల్సినవాడిని సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిగ్ బాస్ 6’ కంటెస్టెంట్ గీతు రాయల్ గురించి ఆసక్తికర విషయాలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus