God Fatherd: బుల్లితెరపై గాడ్ ఫాదర్ మూవీ సంచలనాలు సృష్టిస్తుందా?

గతేడాది థియేటర్లలో దసరా పండుగ కానుకగా విడుదలైన గాడ్ ఫాదర్ మూవీ పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకున్నా కలెక్షన్ల విషయంలో నిరాశపరిచిందనే సంగతి తెలిసిందే. ఈ సినిమాను సొంతంగా విడుదల చేయడంతో డిస్ట్రిబ్యూటర్లకు నష్టాలు రాకపోయినా చిరంజీవి రేంజ్ కు తగిన స్థాయిలో కలెక్షన్లను సాధించకపోవడం మెగా అభిమానులను ఒకింత హర్ట్ చేసిందనే సంగతి తెలిసిందే. థియేటర్లలో యావరేజ్ గా నిలిచిన ఈ సినిమా త్వరలో బుల్లితెరపై ప్రసారం కానుంది.

బుల్లితెరపై ఈ సినిమా ఎలాంటి ఫలితాన్ని సొంతం చేసుకుంటుందో చూడాల్సి ఉంది. సంక్రాంతి పండుగ కానుకగా జెమిని ఛానల్ లో ఈ సినిమా ప్రసారం కానుందని తెలుస్తోంది. ఈ నెల 15వ తేదీన ఈ సినిమా బుల్లితెరపై ప్రసారం కానుంది. థియేటర్లలో ఈ సినిమాను చూడని ప్రేక్షకులు బుల్లితెరపై చూడటానికి ఆసక్తి చూపిస్తున్నారు. సంక్రాంతి పండుగకు చిరంజీవి నటించిన వాల్తేరు వీరయ్య సినిమా థియేటర్లలో విడుదల కానుంది. ఇటు వెండితెరపై అటు బుల్లితెరపై మెగాస్టార్ చిరంజీవి హవా ఉండనుందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

వాల్తేరు వీరయ్య సినిమా ఫుల్ లెంగ్త్ మాస్ ఎంటర్టైనర్ గా ఈ సినిమా తెరకెక్కుతుండగా చిరంజీవి, రవితేజ కలిసి నటించడం వల్ల ఈ సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి. వాల్తేరు వీరయ్య సినిమాకు అడ్వాన్స్ బుకింగ్స్ కోసం ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాకు బుకింగ్స్ విషయంలో కూడా రికార్డులు క్రియేట్ చేయాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు. వాల్తేరు వీరయ్య సినిమాలో ఎన్నో ప్రత్యేకతలు ఉండనున్నాయని సమాచారం అందుతోంది.

వాల్తేరు వీరయ్య మూవీ 140 కోట్ల రూపాయల భారీ బడ్జెట్ తో తెరకెక్కగా ఈ సినిమాకు ఏ రేంజ్ లో కలెక్షన్లు వస్తాయో చూడాల్సి ఉంది. చిరంజీవి కెరీర్ లోనే బిగ్గెస్ట్ గ్రాసర్ గా ఈ సినిమా నిలవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.

బటర్ ఫ్లై సినిమా రివ్యూ& రేటింగ్!
2022లో అలరించిన తెలుగు సినిమాలు ఇవే!

ఇప్పటవరకూ ఎవరు చూడని శ్రీలీల రేర్ ఫోటో గ్యాలరీ!!
‘ఖుషి’ పవన్ ఫ్యాన్స్ కు ఒక డ్రగ్ లాంటిది..రీ రిలీజ్ లో ఎందుకు చూడాలి అంటే..?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus