బ‌హుముఖ ప్ర‌జ్ఞాశాలి… రాజమౌళి..!

‘బాహుబ‌లి’ తో టాలీవుడ్ స్థాయిని ప్రపంచ వ్యాప్తంగా విస్తరింపజేసాడు మన దర్శక ధీరుడు రాజమౌళి. దీంతో రాజమౌళి సినిమా అంటే ఇప్పుడు మంచి క్రేజ్ నెలకొంది. ఇక ఈ చిత్రానికి ముందు నెంబర్ వన్ స్థానం పై విపరీతమైన పోటీ ఉండేది. అయితే ‘నాన్ బాహుబలి’ అనే ఒక్క స్థానాన్ని మాత్రమే విడిచిపెట్టి మొదటి రెండు స్థానాలు తనే కైవసం చేసుకున్నాడు మన జక్కన్న. కేవలం హీరోలను మాత్రమే గొప్ప చేయకుండా.. మన తెలుగు సినిమాని గొప్ప చేయాలనీ.. మన తెలుగు చిత్రాలు మిగిలిన భాషా చిత్రాలతో కూడా పోటీపడాలని… నెంబర్ వన్ స్థానాల కోసం సినిమాలు తీయకూడదని ‘బాహుబలి’ తో నిరూపించాడు. ‘ఇంట గెలిచాం రచ్చ కూడా గెలవాలి’ అనే మాటని నిజం చేసి చూపించాడు.

‘బాహుబలి’ చిత్రంతో రాజమౌళి అందుకున్న కీర్తి అంతా.. ఇంతా కాదు. ఇందులో భాగంగానే.. ప్ర‌పంచంలోనే అత్యంత వేగంగా ఎదుగుతున్న ఇండియన్ రెస్టారెంట్ చైన్ ‘గోదావ‌రి’ మన భార‌తీయ సినీ దిగ్గ‌జం శ్రీ ఎస్.ఎస్ రాజ‌మౌళి కి త‌న మాతృకేంద్ర‌మైన‌ బోస్ట‌న్‌లో గోదావ‌రి ఆత్మీయ స్వాగ‌తం ప‌లికింది. హార్వ‌ర్డ్ యూనివ‌ర్సిటీలో ఇండియా కాన్ఫ‌రెన్స్-2019కు హాజ‌రు కావాల్సిందిగా అందిన ఆహ్వానం మేర‌కు శ్రీ ఎస్‌.ఎస్ రాజ‌మౌళి గారు విచ్చేశారు. గ‌తంలో ఈ ప్ర‌తిష్టాత్మ‌క స‌దస్సుకు భార‌త‌దేశానికి చెందిన ప్ర‌ముఖులు క‌మ‌ల్ హాస‌న్‌,షారుక్ ఖాన్‌, ప‌వ‌న్ క‌ళ్యాణ్ స‌హా మ‌రెంద‌రో ప్ర‌ముఖులు హాజరవ్వగా ఇప్పుడు ఆ లిస్ట్ లో రాజమౌళి కూడా చేరారు.

బ‌హుముఖ ప్ర‌జ్ఞాశాలి అయిన ద‌ర్శ‌క దిగ్గ‌జం ఎస్.ఎస్ రాజ‌మౌళిని బోస్ట‌న్‌కు ఆహ్వానించ‌డాన్ని త‌మ‌కు ద‌క్కిన గ‌ర్వ‌కార‌ణ‌మైన అంశంగా గోదావ‌రి భావిస్తుండడం విశేషం. బోస్ట‌న్‌లో ఆవిర్భ‌వించిన గోదావ‌రి వినియోగ‌దారుల ఆద‌రాభిమానాలు పొందుతూ విశ్వ‌వ్యాప్తంగా త‌న ఆతిథ్యాన్ని అందిస్తోంది.“భార‌తీయ సినీ ప‌రిశ్ర‌మ‌ను స‌త్తాను చాటుతూ మ‌న సినీ ఖ్యాతిని అంత‌ర్జాతీయ ప్ర‌మాణాల స‌ర‌స‌న చేర్చిన ప‌ద్మ‌శ్రీ అవార్డు గ్ర‌హిత, విశ్వ‌విఖ్యాత ప్ర‌ముఖుడు శ్రీ ఎస్.ఎస్ రాజ‌మౌళిని ‘గోదావ‌రి’ ఏర్ప‌డిన బోస్ట‌న్‌కు ఆహ్వానించ‌డం మాకెంతో సంతోషాన్ని క‌లిగిస్తోందని గోదావరి టీం తెలిపింది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus