మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘గాడ్ ఫాదర్’ మూవీ నిన్న అనగా అక్టోబర్ 5న విజయదశమి కానుకగా గ్రాండ్ గా రిలీజ్ అయ్యింది.మోహన్ రాజా దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ మలయాళంలో సూపర్ హిట్ అయిన ‘లూసిఫర్’ కు రీమేక్ అన్న సంగతి తెలిసిందే. కొణిదెల సురేఖ సమర్పణలో ‘కొణిదెల ప్రొడక్షన్స్’, ‘సూపర్ గుడ్ ఫిలింస్’ బ్యానర్ లపై ఆర్ బి చౌదరి, ఎన్ వి ప్రసాద్ ఈ చిత్రాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించారు.ఫస్ట్ డే ఈ చిత్రం పాజిటివ్ టాక్ ను సంపాదించుకుంది కానీ మొదటి రోజు ఓపెనింగ్స్ ఆశించిన స్థాయిలో నమోదుకాలేదు. కానీ రెండో రోజు నుండి మూవీ బాగా కలెక్ట్ చేసింది.
ఒకసారి ఫస్ట్ వీకెండ్ (5 డేస్) కలెక్షన్స్ ను గమనిస్తే:
నైజాం | 10.85 cr |
సీడెడ్ | 8.27 cr |
ఉత్తరాంధ్ర | 4.88 cr |
ఈస్ట్ | 3.20 cr |
వెస్ట్ | 1.85 cr |
గుంటూరు | 3.56 cr |
కృష్ణా | 2.26 cr |
నెల్లూరు | 1.73 cr |
ఏపీ + తెలంగాణ (టోటల్) | 36.6 cr |
రెస్ట్ ఆఫ్ ఇండియా | 4.18 cr |
హిందీ | 4.57 cr |
ఓవర్సీస్ | 4.3 cr |
వరల్డ్ వైడ్ (టోటల్) | 49.65 cr (షేర్) |
‘గాడ్ ఫాదర్’ చిత్రానికి అన్ని వెర్షన్లు కలుపుకుని కు రూ.91.2 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ మూవీ బ్రేక్ ఈవెన్ కావాలంటే రూ.92 కోట్ల వరకు షేర్ ను రాబట్టాలి. 5 రోజులు పూర్తయ్యేసరికి ఈ సినిమా రూ.49.65 కోట్ల షేర్ ను మాత్రమే రాబట్టింది. బ్రేక్ ఈవెన్ కు రూ.42.35 కోట్ల షేర్ ను రాబట్టాలి. ఇప్పుడు పెద్ద సినిమాలు ఏవీ కాబట్టి.. లాంగ్ రన్ నిలబడగలిగితే ఈ మూవీ బ్రేక్ ఈవెన్ సాధించే అవకాశాలు ఉన్నాయి. లేదు అంటే కష్టమే..!
Most Recommended Video
ది ఘోస్ట్ సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిగ్ బాస్ 6’ కపుల్ కంటెస్టెంట్స్ రోహిత్ అండ్ మెరీనా గురించి 10 ఆసక్తికర విషయాలు..!
‘బిగ్ బాస్ 6’ కంటెస్టెంట్ శ్రీహాన్ గురించి ఆసక్తికర విషయాలు..!