Good Bad Ugly Collections: ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ మొదటి సోమవారం కూడా పర్వాలేదు అనిపించింది!

తమిళ స్టార్ హీరో అజిత్ కుమార్ (Ajith Kumar) లేటెస్ట్ మూవీ ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ (Good Bad Ugly) ఏప్రిల్ 10 న రిలీజ్ అయ్యింది. ‘మార్క్ ఆంటోనీ’ (Mark Antony)  ఫేమ్ ఆధిక్ రవిచంద్రన్ (Adhik Ravichandran) దర్శకత్వం వహించిన ఈ సినిమాని టాలీవుడ్ బడా నిర్మాణ సంస్థ ‘మైత్రి మూవీ మేకర్స్’ అధినేతలు అయిన నవీన్ ఎర్నేని(Naveen Yerneni), వై.రవి శంకర్ (Y .Ravi Shankar)..లు భారీ బడ్జెట్ తో నిర్మించారు. మొదటి షోతోనే ఈ సినిమాకి డీసెంట్ టాక్ వచ్చింది. అజిత్ ఫ్యాన్స్ ను అలరించే అంశాలు ఇందులో ఉన్నాయని అంతా చెప్పుకొచ్చారు.

Good Bad Ugly Collections

తమిళంలో భారీ ఓపెనింగ్స్ సాధించిన ఈ సినిమా రూ.200 కోట్ల మైలు రాయిని దాటినట్టు మేకర్స్ ప్రకటించారు. తెలుగు రాష్ట్రాల్లో కూడా బాగానే పికప్ అయ్యింది. ఒకసారి 5 డేస్ కలెక్షన్స్ ని గమనిస్తే :

నైజాం 1.24 cr
సీడెడ్ 0.55 cr
ఆంధ్ర 0.87 cr
ఏపీ + తెలంగాణ (టోటల్) 2.66 cr

‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ సినిమాకి తెలుగు రాష్ట్రాల్లో రూ.5 కోట్ల వరకు థియేట్రికల్ బిజినెస్ చేసింది. బ్రేక్ ఈవెన్ కోసం రూ.5.5 కోట్ల షేర్ ను రాబట్టాలి. 5 రోజుల్లో ఈ సినిమా రూ.2.66 కోట్ల షేర్ ను రాబట్టింది. గ్రాస్ పరంగా రూ.4.53 కోట్లు కలెక్ట్ చేసింది. సో బ్రేక్ ఈవెన్ కోసం మరో రూ.2.84 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది. ఈ వారమంతా ఇలాగే నిలకడగా రాణిస్తే తెలుగు రాష్ట్రాల్లో కూడా బ్రేక్ ఈవెన్ అయ్యే అవకాశాలు ఉంటాయి.

Read Today's Latest Collections Update. Get Filmy News LIVE Updates on FilmyFocus