సినీ రచయితగా, నిర్మాతగా, దర్శకునిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్న వాళ్లలో గుణ్ణం గంగరాజు ఒకరనే సంగతి తెలిసిందే. తాజాగా ఒక ఇంటర్వ్యూలో గుణ్ణం గంగరాజు మాట్లాడుతూ ఆసక్తికర విషయాలను వెల్లడించారు. కాకినాడలో నా విద్యాభ్యాసం మొదలైందని ఐదేళ్ల వయసులోనే హాస్టల్ లో పెట్టారని ఆయన తెలిపారు. సినిమాలపై ఆసక్తితో ఇండస్ట్రీలోకి వచ్చానని ఆయన చెప్పుకొచ్చారు. లిటిల్ సోల్జర్స్ సినిమా షూటింగ్ కు చాలారోజుల సమయం పట్టిందని ఆ సినిమా 100 రోజులు ఆడినా డబ్బు మాత్రం పోయిందని ఆయన తెలిపారు.
అమృతం సీరియల్ గురించి గుణ్ణం గంగరాజు చెబుతూ చందు ఒక కామెడీ సీరియల్ చేయాలనుకున్నాడని మొదట ఏడు ఎపిసోడ్లు షూట్ చేసి ఛానెళ్లను సంప్రదిస్తే ఏ ఛానెల్ తీసుకోలేదని ఆయన అన్నారు. ఆ తర్వాత జెమినిలో స్లాట్ తీసుకుని సీరియల్ ను టెలీకాస్ట్ చేశామని ఆయన చెప్పుకొచ్చారు. నా వయస్సు, సీతారామశాస్త్రి వయస్సు సమానమే అని సీతారామశాస్త్రి గొప్ప జ్ఞాని అని ఆయనతో మాట్లాడుతుంటే సమయం తెలియదని గుణ్ణం గంగరాజు చెప్పుకొచ్చారు.
ఉద్యోగం మానేసిన తర్వాత ఏదో ఒకటి చేయాలని యాడ్ ఏజెన్సీలో చేశానని ఆయన తెలిపారు. సీరియళ్లకు క్రమంగా ఆదాయం తగ్గిపోయిందని ఓటీటీకి అయితే సీరియల్స్ చేస్తానని గుణ్ణం గంగరాజు చెప్పుకొచ్చారు. ప్రస్తుతం టికెట్ ధర కంటే పాప్ కార్న్ ధర ఎక్కువగా ఉందని కర్ణాటకలో సినిమా థియేటర్ కు కోటి రూపాయల లంచం ఇవ్వాలని గుణ్ణం గంగరాజు అన్నారు. అన్ని నిబంధనలు పాటించినా అనుమతులు రావని ఆయన అన్నారు.
అమృతం సీరియల్ ను నవలగా రాస్తున్నానని ఒక ఎపిసోడ్ అయిపోయిందని పుస్తకం చదువుతారో లేదో తెలియదని అందుకే నవలను ఆడియో బుక్ గా తీసుకొస్తున్నామని ఆయన చెప్పుకొచ్చారు. అమృతం సీరియల్ కు ఈ జనరేషన్ లో కూడా ఎంతోమంది అభిమానులు ఉన్నారు. గుణ్ణం గంగరాజు వెల్లడించిన విషయాలు ఆ సీరియల్ అభిమానులకు శుభవార్తే అని చెప్పాలి.
Most Recommended Video
తరుణ్,ఎన్టీఆర్ టు కళ్యాణ్ రామ్.. సినిమాల్లో చనిపోయే పాత్రలు చేసిన స్టార్లు..!
చేయని తప్పుకి శాస్త్రవేత్తపై దేశద్రోహి కేసు..!
క్రేజీ ప్రాజెక్టులు పట్టేసిన 10 మంది కొత్త డైరెక్టర్లు.. హిట్లు కొడతారా?