స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఎన్టీఆర్ పుట్టినరోజు కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ రాజమౌళి దర్శకత్వంలో ఆర్ఆర్ఆర్ సినిమాలో నటిస్తుండగా కొరటాల శివ దర్శకత్వంలో నటించబోయే సినిమా షూటింగ్ జూన్ నుంచి ప్రారంభం కానుందని తెలుస్తోంది. ఆచార్య సినిమా షూటింగ్ పనులను వేగంగా పూర్తి చేస్తున్న కొరటాల శివ గతంలోనే ఎన్టీఆర్ సినిమా స్క్రిప్ట్ పనులను పూర్తి చేశారు.
జూనియర్ ఎన్టీఆర్ అరవింద సమేత షూటింగ్ లో పాల్గొంటున్న సమయంలో జనతా గ్యారేజ్ తరువాత ఎన్టీఆర్ కొరటాల శివ కాంబినేషన్ లో ఒక సినిమా తెరకెక్కుతున్నట్టు ప్రకటన వెలువడింది. రాజమౌళి ఆర్ఆర్ఆర్ సినిమాలో ఒక హీరోగా ఎంపిక కావడంతో వాయిదా పడిన ఆ ప్రాజెక్టు పట్టాలెక్కుతోంది. స్క్రిప్ట్ సిద్ధంగా ఉండటంతో కొరటాల శివ శరవేగంగా ఈ సినిమా షూటింగ్ ను పూర్తి చేయనున్నారని తెలుస్తోంది.
ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా ఎన్టీఆర్ కొరటాల శివ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమాకు సంబంధించిన టైటిల్ ప్రకటన వెలువడే అవకాశాలు ఉన్నాయని ప్రచారం జరుగుతోంది. ఆర్ఆర్ఆర్ సినిమా నుంచి కూడా స్పెషల్ పోస్టర్ రిలీజ్ కానుందని మరో టీజర్ మాత్రం రిలీజ్ కాదని సమాచారం. అయితే స్పెషల్ పోస్టర్ కూడా రిలీజయ్యే అవకాశం లేదని కూడా ప్రచారం జరుగుతోంది.
ఆర్ఆర్ఆర్ సినిమా నుంచి పోస్టర్ రిలీజ్ కాకపోతే మాత్రం ఎన్టీఆర్ ఫ్యాన్స్ నిరాశకు గురయ్యే అవకాశం ఉంది. రాజమౌళి ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా ఎన్టీఆర్ ఫ్యాన్స్ కు సర్ ప్రైజ్ ఇస్తారో లేక షాక్ ఇస్తారో చూడాల్సి ఉంది.
Most Recommended Video
‘వకీల్ సాబ్ ‘ నుండీ ఆకట్టుకునే 17 పవర్ ఫుల్ డైలాగులు!
ఈ 10 మంది టాలీవుడ్ హీరోలకి బిరుదులు మార్చిన సినిమాల లిస్ట్..!
లాయర్ గెటప్ లలో ఆకట్టుకున్న 12 మంది హీరోలు వీళ్ళే..!