ప్రేక్షకాదరణ పొందుతున్న ‘స్ట్రీట్ లైట్’ చిత్రం

తాన్య దేశాయ్, అంకిత్ రాజ్, సీనియర్ హీరో వినోద్ కుమార్ ప్రధాన పాత్రల్లో ‘చిత్రం’ శ్రీను, ధనరాజ్, షకలక శంకర్, ఈశ్వర్, కావ్య రెడ్డి, వైభవ్, కొండా బాబు, సాయి కీర్తన , Dr. పరమహంస, పవిత్ర బాలాజీ నాగలింగం వంటి వారు ముఖ్య పాత్రల్లో ‘యుఅండ్ఐ’ పతాకం పై మామిడాల శ్రీనివాస్ నిర్మాణంలో దర్శకుడు విశ్వ తెరకెక్కించిన చిత్రం ‘స్ట్రీట్ లైట్’.నవంబర్ 19న విడుదలైన ఈ చిత్రం పాజిటివ్ టాక్ ను సంపాదించుకుని దూసుకుపోతుంది.

హైదరాబాద్ మహా నగరం అనేది పగలు ఎంత అందంగా పవిత్రం గా కనిపిస్తుందో…  రాత్రయ్యేసరికి పబ్ లు, పార్టీ లు,డ్రగ్స్, దందాలతో ఎంత భయంకరంగా ఉంటుందనే పాయింట్ ను చాలా చక్కగా ఆవిష్కరించారు.హైదరాబాద్ చివార్లలో వుండే ఒక చిన్న ప్రాంతం లోని బస్ స్టాప్ వద్ద ఉండే స్ట్రీట్ లైట్ చుట్టూ ఈ కథ సాగుతుంది.  ఓ మాజీ ఎం.ఎల్.ఎ మరియు అతని భార్య కుమారి, కూతురు వైజయంతి (తాన్యదేశాయి ) అలాగే ఏసీపీ ఉదయ్ కుమార్ (సీనియర్ నటుడు వినోద్ కుమార్ ) ల చుట్టూ జరిగే రివేంజ్ డ్రామా ఇది. ఆ ఎ.సి.పి వల్ల ఎం.ఎల్.ఎ కుటుంబానికి జరిగిన అన్యాయం ఏంటి? అన్న పాయింట్ ను చాలా ఎంగేజింగ్ గా తెరకెక్కించారు.

సీనియర్ నటుడు వినోద్ కుమార్ చాలా కాలం తర్వాత ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. నెగటివ్ షేడ్స్ కలిగిన పాత్రని ఆయన ఎంతో అద్భుతంగా పోషించాడు.వైజయంతి పాత్రని పోషించిన తాన్యదేశాయ్ తన గ్లామర్ తో కుర్రకారుని అలరించడంతో పాటు యాక్షన్ సన్నివేశాల్లో కూడా సత్తా చాటింది.ఆమె తల్లి పాత్ర కూడా కథలో చాలా కీలకం.కమెడియన్స్ చిత్రం శ్రీను,షకలక శంకర్ ల  కామెడీ బోర్ గా అదేవిధంగా వారితో చేయించిన ఓ పాట విసిగించేలా ఉంటుంది.డైరెక్టర్ విశ్వ తన టేకింగ్ తో బాగానే కథని నడిపించాడు.

కాకపోతే అనవసరమైన కామెడీని పెట్టి డైవర్ట్ చేసాడేమో అనిపిస్తుంది. విరించి నేపధ్య సంగీతం,సినిమాటోగ్రఫర్ రవిప్రకాష్ పనితనానికి ప్రశంసలు కూర్చుస్తున్నాయి.నిర్మాత మామిడాల శ్రీనివాస్ ఖర్చుకి వెనుకాడకుండా తనకి సినిమా పై ఉన్న ప్యాషన్ తో ఎంతో అద్భుతంగా  స్ట్రీట్ లైట్ ను రూపొందించాడు. ట్రైలర్లో యూత్ ఫుల్ ఎలిమెంట్స్ మాత్రమే ఉన్నా సినిమాలో మంచి ఎమోషనల్ కంటెంట్ కూడా ఉంది.మొత్తంగా వీకెండ్ కు మంచి టైం పాస్ లాంటి సినిమా ‘స్ట్రీట్ లైట్’ అని ప్రేక్షకుల నుండీ వస్తున్న స్పందనకి చిత్రబృందం సంతోషం వ్యక్తం చేస్తుంది.

పుష్పక విమానం సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

ప్రకటనలతోనే ఆగిపోయిన మహేష్ బాబు సినిమాలు ఇవే..!
రాజా విక్రమార్క సినిమా రివ్యూ & రేటింగ్!
3 రోజెస్ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus