అడివి శేష్ హీరోగా శశి కిరణ్ తిక్కా దర్శకత్వంలో రూపొందిన గూఢచారి చిత్రం 2018 లో రిలీజ్ అయ్యి బ్లాక్ బస్టర్ గా నిలిచింది. కేవలం రూ.5 కోట్ల బడ్జెట్ లో రూపొందిన ఈ చిత్రం నిర్మాతలకు భారీ లాభాలను అందించింది. ఇలాంటి చిత్రాలను ఇంత తక్కువ బడ్జెట్ లో రూపొందించడం అంటే మామూలు విషయం కాదు. పైగా ఈ సినిమాలో విజువల్స్ కూడా చాలా క్వాలిటీగా ఉంటాయి. టేకింగ్ కూడా హాలీవుడ్ చిత్రాన్ని తలపిస్తుంది.
పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ పిక్చర్స్, విస్తా డ్రీమ్ మర్చంట్స్ , సంస్థల పై అభిషేక్ నామా, టి.జి.విశ్వప్రసాద్, అభిషేక్ అగర్వాల్ కలిసి ఆ చిత్రాన్ని నిర్మించారు. ఏకే ఎంటర్టైన్మెంట్స్ అధినేత అనిల్ సుంకర.. ఈ చిత్రాన్ని రిలీజ్ చేయడం జరిగింది. ఇక ఈ చిత్రానికి సీక్వెల్ రూపొందనున్నట్టు చాలా కాలం క్రితమే మేకర్స్ ప్రకటించారు. కానీ ఇప్పటికీ ఆ ప్రాజెక్ట్ మొదలుకాలేదు. అయితే ఎట్టకేలకు గూఢచారి2 మొదలుకాబోతుంది. అయితే ఈ చిత్రాన్ని శశి కిరణ్ తిక్క డైరెక్ట్ చేయడం లేదు.
గూఢచారి చిత్రానికి అసిస్టెంట్ డైరెక్టర్ గా, అసోసియేట్ ఎడిటర్ గా చేసిన వినయ్ కుమార్ శిరిగినీడి డైరెక్ట్ చేస్తున్నాడు. ఇతను చాలా టాలెంటెడ్ అని కచ్చితంగా టాలీవుడ్లో పెద్ద డైరెక్టర్ అవుతాడు అని హీరో అడివి శేష్ ధీమాగా చెప్పాడు. ఇక గూఢచారి2 చిత్రం బడ్జెట్ ఎంత వరకు అవుతుంది
అని చిత్ర బృందాన్ని ప్రశ్నించగా.. ఫస్ట్ పార్ట్ కు డబుల్ బడ్జెట్ అవుతుంది. ఫైనల్ గా అందులో హాఫ్ పెరగొచ్చు. టోటల్ గా రూ.70 కోట్ల బడ్జెట్ అవుతుంది అని తెలిపారు. తెలుగుతో పాటు ఈ చిత్రాన్ని హిందీ,తమిళ, కన్నడ,మలయాళ భాషల్లో కూడా రిలీజ్ చేయబోతున్నారు.
8 సార్లు ఇంటర్నేషనల్ అవార్డ్స్ తో తెలుగు సినిమా సత్తాను ప్రపంచవ్యాప్తంగా చాటిన రాజమౌళి!
2022 విషాదాలు: ఈ ఏడాది కన్నుమూసిన టాలీవుడ్ సెలబ్రటీల లిస్ట్..!
రోజా టు త్రిష.. అప్పట్లో సంచలనం సృష్టించిన 10 మంది హీరోయిన్ల ఫోటోలు, వీడియోలు..!
హిట్-ప్లాప్స్ తో సంబంధం లేకుండా అత్యధిక వసూళ్లు సాధించిన పది రవితేజ సినిమాలు!