Gopichand: ఆ సినిమా ఫ్లాప్ అవుతుందని గోపీచంద్ కు ముందే తెలుసా?

గోపీచంద్ శ్రీవాస్ కాంబినేషన్ బ్లాక్ బస్టర్ కాంబినేషన్ కాగా ఈ కాంబినేషన్ లో తెరకెక్కిన లక్ష్యం, లౌక్యం బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్లుగా నిలిచాయి. ఈ రెండు సినిమాలు నిర్మాతలకు మంచి లాభాలను అందించాయి. అయితే ఈ కాంబినేషన్ లో మూడో సినిమాగా తెరకెక్కిన రామబాణం సినిమా మాత్రం ప్రేక్షకుల అంచనాలను అందుకోలేదు. నిర్మాతలకు సైతం ఈ సినిమా నష్టాలను మిగిల్చింది. అయితే రామబాణం సినిమాలో ఎమోషన్స్ వర్కౌట్ కాలేదని అందుకే ఈ సినిమా ఆశించిన ఫలితాన్ని సొంతం చేసుకోలేదని గోపీచంద్ తెలిపారు.

ఈ సినిమా రిజల్ట్ విషయంలో దర్శకుడి తప్పేం లేదని గోపీచంద్ పేర్కొన్నారు. సినిమా మధ్యలోనే ఈ సినిమా ఫలితం అర్థమైందని ఆయన అభిప్రాయపడ్డారు. సాధారణంగా చాలామంది హీరోలు సినిమా ఫ్లాపైతే దర్శకుడిదే తప్పని నిందిస్తారు. ఈ విషయంలో గోపీచంద్ గ్రేట్ అని కామెంట్లు వినిపిస్తున్నాయి. గోపీచంద్ మార్చి నెల 8వ తేదీన భీమా సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఈ సినిమాతో కచ్చితంగా బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంటానని గోపీచంద్ నమ్మకంతో ఉన్నారు.

రికార్డ్ స్థాయి స్క్రీన్లలో ఈ సినిమా రిలీజ్ కానుండగా ఈ సినిమాకు బిజినెస్ కూడా భారీ రేంజ్ లోనే జరిగిందని తెలుస్తోంది. గోపీచంద్ పోలీస్ ఆఫీసర్ గా ఈ మూవీలో నటిస్తున్నారు. గోపీచంద్ కెరీర్ కు ఈ సినిమా సక్సెస్ సాధించడం కీలకమనే సంగతి తెలిసిందే. రాబోయే రోజుల్లో గోపీచంద్ ఇతర భాషలపై దృష్టి పెడితే మార్కెట్ మరింత పెరిగే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు.

గోపీచంద్ (Gopichand)  ఇకపై మొహమాటం లేకుండా సినిమాలలో నటిస్తానని చెప్పుకొచ్చారు. గోపీచంద్ త్వరలో మరిన్ని క్రేజీ ప్రాజెక్ట్ లను ప్రకటించనున్నారని సమాచారం అందుతోంది. గోపీచంద్ పరిమితంగా పారితోషికం తీసుకుంటున్నారు. గోపీచంద్ శ్రీనువైట్ల కాంబో మూవీ గురించి త్వరలో ఆసక్తికర అప్ డేట్స్ రానున్నాయి.

‘సలార్’ ఫైనల్ గా ఎంత కలెక్ట్ చేసిందంటే?!

నయన్ విఘ్నేష్ మధ్య విబేధాలకు అదే కారణమా.. అసలేమైందంటే?
నిశ్చితార్థం చేసుకున్న వరలక్ష్మి శరత్ కుమార్.. వరుడి బ్యాగ్రౌండ్ ఇదే!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus