Pakka Commercial Movie: హిట్టు కళ కనిపిస్తుంది.. గోపీచంద్ కు కం-బ్యాక్ ఇచ్చేలా ఉన్నాడు..!

జూన్ 12న టాలీవుడ్ హీరో గోపీచంద్ పుట్టినరోజు కావడంతో.. ‘పక్కా కమర్షియల్’ టీం ఫస్ట్ లుక్ పోస్టర్ ను విడుదల చేశారు. ‘జి.ఎ2 పిక్చర్స్’ మరియు ‘యూవీ క్రియేషన్స్’ బ్యానర్ల పై బన్నీ వాస్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈరోజు ఆయన పుట్టినరోజు కూడా కావడం విశేషం. ఇక మారుతి ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేస్తుండడం విశేషం. ఈ చిత్రంలో గోపీచంద్ లాయర్ పాత్రలో కనిపించనున్నారని సినిమా ప్రారంభమైనప్పటి నుండీ ప్రచారం జరుగుతుంది.

అయితే ఆ విషయం పై చిత్ర యూనిట్ సభ్యులు ఎటువంటి క్లారిటీ ఇవ్వలేదు. ఇదిలా ఉండగా.. తాజాగా విడుదలైన ‘పక్కా కమర్షియల్’ పోస్టర్ కు మంచి స్పందన లభిస్తోంది.వైట్ షర్ట్, బ్లాక్ ఫాంట్ ధరించి అల్ట్రా స్టైలిష్ లుక్ లో గోపీచంద్ ఈ పోస్టర్ లో కనిపిస్తున్నాడు. కామెడీ అండ్ ఎమోషనల్ ఎంటర్టైనర్ గా ఈ చిత్రం రూపొందుతోంది. గోపీచంద్ కు జోడీగా రాశి ఖన్నా నటిస్తోంది. సత్య రాజ్ కూడా ఈ చిత్రంలో కీలక పాత్ర పోషిస్తున్నారు.

జేక్స్ బిజోయ్ సంగీత దర్శకుడు. ఈ ఫస్ట్ లుక్ పోస్టర్ సినిమా పై అంచనాలను పెంచేసిందనే చెప్పాలి. కచ్చితంగా ఈ చిత్రంతో గోపీచంద్ కం బ్యాక్ ఇవ్వడం గ్యారెంటీ అని అతను అభిమానులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. మరో పక్క ‘సీటీమార్’ టీం వారు కూడా గోపీచంద్ పుట్టినరోజు కానుకగా ఓ స్పెషల్ పోస్టర్ లేదా మరో టీజర్ ను విడుదల చేసే అవకాశం ఉందని సమాచారం.


Most Recommended Video

ఈ 10 మంది టాప్ డైరెక్టర్లు తెలంగాణ రాష్ట్రానికి చెందిన వాళ్ళే..!
2 ఏళ్ళుగా ఈ 10 మంది డైరెక్టర్ల నుండీ సినిమాలు రాలేదట..!
టాలీవుడ్లో రూపొందుతున్న 10 సీక్వెల్స్ లిస్ట్..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus