Gopichand: గోపీచంద్ రెండో కుమారుడు వియాన్..వైరల్ అవుతున్న పిక్స్..!

సెలబ్రిటీల పర్సనల్ విషయాల గురించి తెలుసుకోవడానికి ఫ్యాన్స్ తో పాటు నార్మల్ ఆడియన్స్ కూడా ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు.. అందుకే ట్విట్టర్, ఇన్ స్టాగ్రామ్ లాంటి సోషల్ మీడియా ఫ్లాట్ ఫామ్స్ లో మిలియన్ల సంఖ్యలో వాళ్ళని ఫాలో చేస్తుంటారు.. రీసెంట్ గా ‘మ్యాచో స్టార్’ గోపీచంద్ పిక్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఈ పిక్స్ స్పెషాలిటీ ఏంటంటే గోపీచంద్ తన ముద్దుల కొడుకుతో కలిసి ఫోటోలకు ఫోజులివ్వడమే.. తెలుగు ఇండస్ట్రీలో మాదాల రంగారావు, ఆర్.నారాయణ మూర్తి కంటే ముందు రివల్యూషనరీ డైరెక్టర్ గా గుర్తింపు తెచ్చుకున్నారు గోపీచంద్ తండ్రి టి.కృష్ణ..

తండ్రి, అన్నయ్య మరణం తర్వాత ‘తొలివలపు’ సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన గోపి.. ఆ తర్వాత ‘జయం’, ‘వర్షం’, ‘నిజం’ మూవీస్ లో బెస్ట్ విలనిజాన్ని చూపించి ఆకట్టుకున్నాడు.. రెబల్ స్టార్ ప్రభాస్ ఫ్రెండ్ అయిన గోపి కూడా కొంతకాలం పెళ్ళికి దూరంగానే ఉన్నాడు.. ఎట్టకేలకు సీనియర్ హీరో శ్రీకాంత్ మేనకోడలిని పెళ్లాడాడు..ఈ కపుల్ కి ఇద్దరు బాబులున్నారు.. పెద్దబ్బాయికి తండ్రి పేరు పెట్టారు.. రెండో అబ్బాయి పేరు వియాన్..

సాధారణంగా పర్సనల్ లైఫ్ విషయంలో ప్రైవసీ కోరుకుంటాడు గోపీచంద్.. ఫస్ట్ బర్త్ డే, ఫెస్టివల్స్ అప్పుడు తప్ప బయట పెద్దగా భార్య, పిల్లలతో కనిపించలేదాయన.. అలాంటిది ఇప్పుడు చిన్న కొడుకు వియాన్ తో కలిసి తీసుకున్న ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నాయి.. తండ్రీ కొడుకులిద్దరూ మ్యాచింగ్ డ్రెస్ లో మురిసిపోయారు.. తన ఒడిలో కూర్చున్న వియాన్ ని చూసి గోపి మురిసిపోయాడు.. ‘వావ్.. వియాన్ భలే క్యూట్ ఉన్నాడు’.. ‘బుగ్గలు పాలుకారుతున్నాయి.. ముద్దొస్తున్నాడు’ అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు..

సినిమాల విషయానికొస్తే.. హీరోగా గతకొంతకాలంగా సరైన సాలిడ్ మూవీ కోసం వెయిట్ చేస్తున్నాడు గోపీచంద్.. కంటిన్యూస్ గా సినిమాలు చేస్తున్నా కానీ హిట్ పడట్లేదు.. తనకు ‘లక్ష్యం’, ‘లౌక్యం’ వంటి సూపర్ హిట్స్ ఇచ్చిన డైరెక్టర్ శ్రీవాస్ తో హ్యాట్రిక్ కి రెడీ అవుతున్నాడు… అలాగే ఒకప్పుడు తన పేరునే బ్రాండ్ గా మార్చుకుని కామెడీ ఎంటర్ టైనర్స్ తో సూపర్ హిట్స్ కొట్టిన శ్రీను వైట్లతోనూ ఓ సినిమా చేయనున్నాడని వార్తలు వినిపిస్తున్నాయి..

కాంతార సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

ఎన్టీఆర్ – సావిత్రి టు చిరు- నయన్.. భార్యాభర్తలుగా చేసి కూడా బ్రదర్- సిస్టర్ గా చేసిన జంటలు..!
తన 44 ఏళ్ల కెరీర్లో చిరంజీవి రీమేక్ చేసిన సినిమాలు మరియు వాటి ఫలితాలు..!
సౌందర్య టు సమంత.. గర్భవతి పాత్రల్లో అలరించిన హీరోయిన్ల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus