‘లౌక్యం’ తర్వాత సారైన హిట్టు కోసం ఎదురుచూస్తున్న గోపీచంద్ కు … ఇంకా ఆశించిన హిట్టు దక్కలేదు. ఆ తర్వాత వచ్చిన ‘సౌఖ్యం’ ‘ఆక్సిజన్’ ‘గౌతమ్ నంద’ వంటి చిత్రాలు డిజాస్టర్ లు అయ్యాయి. ‘ఆరడుగుల బుల్లెట్’ అనే చిత్రం అసలు విడుదలకు నోచుకోలేదు. ఆ తరువాత గోపీచంద్ 25 వ చిత్రంగా ‘పంతం’ వచ్చింది. ‘శ్రీ సత్య సాయి ఆర్ట్స్’ బ్యానర్ పై రాధా మోహన్ నిర్మించిన ఈ చిత్రానికి కె.చక్రవర్తి దర్శకుడు. జూలై 5 2018 లో విడుదలైన ఈ చిత్రానికి మంచి టాక్ వచ్చింది.
రివ్యూస్ కూడా డీసెంట్ గానే వచ్చాయి. మంచి సోషల్ మెసేజ్ తో రూపొందిన ఈ చిత్రం కమర్షియల్ గా యావరేజ్ గానే మిగిలింది. అయితే ఇప్పుడు ఈ చిత్రానికి మంచి రెస్పాన్స్ వస్తుంది. అదేంటి.. విడుదలయ్యి రెండు సంవత్సరాలు కావస్తున్న ఈ చిత్రానికి ఇప్పుడు ప్రశంసలు దక్కడం ఏంటి అనుకుంటున్నారా? ఇప్పుడు లాక్ డౌన్ కారణంగా అందరూ ఇంట్లోనే ఉంటున్న నేపధ్యంలో ఇప్పుడు డిజిటల్ స్ట్రీమింగ్ ప్లాట్ ఫామ్స్ కి మంచి డిమాండ్ ఏర్పడిన సంగతి తెలిసిందే.
ఈ నేపధ్యంలో సన్ నెక్స్ట్ లో ‘పంతం’ చిత్రం మోస్ట్ వాచ్డ్ మూవీ గా నిలిచింది. ఈ చిత్రానికి ఎక్కువ మంది వీక్షిస్తున్నారని కూడా తెలుస్తుంది. ఏమైనా థియేటర్ లో రాని రెస్పాన్స్ డిజిటల్ ప్లాట్ ఫామ్లో వస్తున్నందుకు చిత్ర యూనిట్ ఒకింత హ్యాపీగా ఉన్నట్టు తెలుస్తుంది. ఇక గోపీచంద్ ప్రస్తుతం సంపత్ నంది డైరెక్షన్లో ‘సీటీమార్’ చిత్రం చేస్తూ బిజీగా ఉన్నాడు.
Most Recommended Video
తండ్రికి తగ్గ తనయలు అనిపిస్తున్న డైరెక్టర్స్ కూతుళ్లు!
నిర్మాతలుగా కూడా సత్తా చాటుతున్న టాలీవుడ్ హీరోలు!
టాలీవుడ్ టాప్ హీరోల వరస్ట్ లుక్స్ ఇవే!