జూన్ 5న… గోపిచంద్ ‘పంతం’ టీజర్!

టాలీవుడ్‌ యాక్ష‌న్ హీరో గోపీచంద్ క‌థానాcయ‌కుడిగా నటిస్తోన్న చిత్రం ‘పంతం’. `ఫ‌ర్ ఎ కాస్‌` అనేది ఉప శీర్షిక‌. శ్రీ స‌త్య‌సాయి ఆర్ట్స్ బ్యాన‌ర్‌పై కె.కె. రాధామోహ‌న్ నిర్మిస్తున్నారు. గోపీచంద్ న‌టిస్తోన్న 25వ చిత్ర‌మిది. ఇందులో మెహరీన్‌ కథానాయికగా నటిస్తున్నారు. `బ‌లుపు`, `ప‌వ‌ర్‌`, `జై ల‌వకుశ` వంటి బ్లాక్ బ‌స్ట‌ర్ చిత్రాల‌కు స్క్రీన్‌ప్లే అందించిన కె.చ‌క్ర‌వ‌ర్తి ఈ చిత్రంతో ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అవుతున్నారు. ఈ సినిమాను జూలై 5న విడుద‌ల చేయ‌డానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ నెల 5న ఉదయం 11 గంటలకు సినిమా టీజర్‌ను విడుదల చేస్తారు.

ఈ సంద‌ర్భంగా నిర్మాత కె.కె.రాధామోహ‌న్ మాట్లాడుతూ – “గోపీచంద్‌గారి సిల్వ‌ర్ జూబ్లీ సినిమాను మా బ్యాన‌ర్‌లో నిర్మిస్తుండ‌టం ఆనందంగా ఉంది. మంచి మెసేజ్‌తో పాటు క‌మ‌ర్షియ‌ల్ ఎలిమెంట్స్ ఉన్న చిత్రమిది. ఇటీవల టాకీ చిత్రీకరణ పూర్తయింది. ప్ర‌స్తుతం లండన్‌, స్కాట్‌లాండ్‌లోని అందమైన లొకేషన్లలో పాటలు చిత్రీకరిస్తున్నాం. త్వరలో పోస్ట్ ప్రొడక్ష‌న్ కార్య‌క్ర‌మాల‌ను పూర్తి చేసి జూలై 5న ప్ర‌పంచ వ్యాప్తంగా సినిమాను గ్రాండ్‌గా రిలీజ్ చేయ‌డానికి ప్లాన్ చేస్తున్నాం. డైరెక్ట‌ర్ చ‌క్ర‌వ‌ర్తి సినిమాను అద్భుతంగా తెర‌కెక్కించారు. సినిమా అవుట్‌పుట్ చ‌క్క‌గా వ‌స్తుంది“ అని తెలిపారు.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus