రౌడీ క్లబ్ క్రియేట్ చేస్తున్న విజయ్ దేవరకొండ!

చిరంజీవికి చరిష్మా ఉంది, పవన్ కళ్యాణ్ కి క్రేజ్ ఉంది, బాలయ్యకి బలగం ఉంది, జూనియర్ ఎన్టీఆర్ కి నటన ఉంది.. ఇలా ప్రతి హీరోకి ప్రజలు ఫాలో అవ్వడానికి ఏదో ఒక రీజన్ ఉంది. అయితే.. యువ కథానాయకుల విషయంలోకి వచ్చేసరికి ప్రేక్షకుల్ని ఆకట్టుకోవడానికి వాళ్ళకి పెద్దగా ఏమీ మిగలలేదు. అందుకే యాటిట్యూడ్ తో ఆడియన్స్ ని ఆకట్టుకొంటున్నారు. అలా తన సినిమాలతో కంటే ఎక్కువగా తన చేష్టలతో ప్రేక్షకుల్ని ఆకట్టుకొంటున్న యువ కథానాయకుడు విజయ్ దేవరకొండ. ఇప్పటివరకూ నటించిన సినిమాల్లో కేవలం రెండే హిట్లు ఉన్నప్పటికీ.. ఆ హిట్స్ తో ఏమాత్రం సంబంధం లేకుండా కేవలం తన బిహేవియర్ తో యువతకు దగ్గరయ్యాడు.

ఆ యువతకు ఇంకాస్త దగ్గరయ్యేందుకు సన్నాహాలు చేసుకొంటున్నాడు విజయ్ దేవరకొండ. అందులో భాగంగానే “రౌడీ క్లబ్”ను మొదలెట్టాడు. తాను క్రియేట్ చేసిన వెబ్ సైట్ లో గనుక తమ డీటెయిల్స్ ఇచ్చి రిజిష్టర్ చేసుకొంటే.. తనతో పాటు ఈనెల 16వ తారీఖున హదరాబాద్ లో జరగబోయే ఫిలిమ్ ఫేర్ అవార్డ్స్ ఈవెంట్ కి వెళ్ళే అవకాశం కూడా సొంతం చేసుకోవచ్చు. నిజంగానే ఈవెంట్ కి తీసుకెళ్తాడా లేదా అనే విషయం పక్కన పెడితే.. ఈరకంగా తన ఫ్యాన్ బేస్ ను మాత్రం భీభత్సంగా డెవలప్ చేసుకొంటున్నాడు విజయ్ దేవరకొండ.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus