ఇదివరకు ప్రభుత్వ యంత్రాంగం పోకడ విభిన్నంగా ఉండేది. సామాన్యులను ఒకలా.. కాస్త పరపతి ఉన్న వారిని ఒకలా చూసేవారు. కానీ.. ఇప్పుడు ఆ పోకడలో మార్పు వచ్చింది. తప్పు చేసింది ఎవరైనా సరే అస్సలు ఊరుకోవడం లేదు మన ప్రభుత్వ అధికారులు. ఇటీవలే ప్రభాస్ గెస్ట్ హౌజ్ ను సీజ్ చేసిన ప్రభుత్వ యంత్రాంగం.. నిన్న రాత్రి మహేష్ బాబు బ్యాంక్ అకౌంట్స్ సీజ్ చేసింది. దాంతో ఒక్కసారిగా ఉలిక్కిపడినంత పనిచేశాడు మహేష్ బాబు. ఏడాదికి కోట్లలో సంపాదించే మహేష్ బాబు సరిగా జి.ఎస్.టి కట్టకపోవడంతో ఆయన ఎకౌంట్స్ ను సీజ్ చేసింది జి.ఎస్.టి కౌన్సిల్.
2007 నుంచి 2008 కాలంలో మహేష్ బాబు బ్రాండ్ అంబాసిడర్ గా, కథానాయకుడిగా సంపాదించిన సొమ్ముకు సంబంధించిన ఎలాంటి ట్యాక్స్ పే చేయలేదట. దాంతో యాక్సిస్ బ్యాంక్ మరియు ఐ.సి.ఐ.సి.ఐ బ్యాంకుల్లో మహేష్ బాబుకి ఉన్న ఎకౌంట్స్ ను సీజ్ చేసింది జి.ఎస్.టి కౌన్సిల్. ఆ అకౌంట్స్ లో ఉన్న 73 లక్షల రూపాయలను తమకు కట్టాల్సిన ట్యాక్స్ మరియు వెడ్డీగా ఫ్రీజ్ చేసింది. నిజానికి ఇది పెద్ద మేటర్ కాదు కానీ.. మహేష్ బాబు లాంటి పబ్లిక్ ఫిగర్ విషయంలో జరగడంతో హైలైట్ అయ్యింది.