ఆ హీరోయిన్ కోసం రోజుకు వెయ్యి రోజాలు పంపాడట !!

అభిమానుల్లో రెండు రకాలు. సగటు అభిమాని, వీరాభిమాని. ఈ సగటు అభిమాని అంటే.. తమకు ఇష్టమైన హీరో లేదా హీరోయిన్ ను మనసులోనే ఆరాధిస్తుంటారు. వారి సినిమాలు విడుదలైనప్పుడు ఫస్ట్ డే ఫస్ట్ షో చూడడం, వారి సినిమాల పోస్టర్లు వచ్చినప్పుడు ఫేస్ బుక్ లేదా ట్విట్టర్ లో షేర్ చేయడం వరకే వారి అభిమానం పరిమితమవుతుంటుంది.

రెండోది వీరాభిమానం.. ఈ రకం అభిమానులు తమ ప్రియతమ హీరో/హీరోయిన్ పై చూపించే ప్రేమ/ఆప్యాయత మామూలుగా ఉండవు. తమకిష్టుడైన కథానాయకుడి సినిమాలు రిలేజ్ అయితే సదరు హీరో పోస్టర్లపై పాలాభిషేకం చేసేవారు కొందరు, ఫస్ట్ డే థియేటర్ మొత్తాన్ని కాగితాలతో నింపేసేవారు కొంత మంది. తమ అభిమాన కథానాయిక/కథానాయకుడు గురించి ఎవరైనా తప్పుగా మాట్లాడినా, కనీసం ప్రస్తావించినా తట్టుకోలేని వారు ఇంకొందరు.

కానీ.. బికినీ బేబీ “సోనాల్ చౌహాన్”కు వీరాభిమాని అయిన యువకుడు మాత్రం విచిత్రంగా.. సోనాల్ నివసిస్తున్న ఫ్లాట్ కు రోజుకి 1000 రోజా పువ్వులు పంపిస్తున్నాడట. వారం రోజులుగా ఒక్క రోజు కూడా గ్యాప్ లేకుండా ఇప్పటివరకూ పంపుతూనే ఉన్నాడట. ఇప్పటివరకూ సోనాల్ అందుకొన్న రోజాల సంఖ్య 8000. ఆ పూలన్నింటినీ సోనాల్ తన ఇంట్లో డెకరేట్ చేసుకొంటూ.. తన అభిమాని తనపై చూపిస్తున్న అభిమానానికి పులకించిపోతోంది!

8k roses n I still don’t know who you are !!! This is the only way I could thank you !!! #thankyou

A photo posted by Sonal Chauhan (@sonalchauhan) on

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus