Gulabi Movie Writer: సినీ పరిశ్రమలో విషాదం..’గులాబీ’ రైటర్ కన్నుమూత.!

సినీ పరిశ్రమలో విషాదాల సంఖ్య పెరుగుతూనే ఉంది తప్ప తగ్గడం లేదు. ఈ మధ్యనే ‘గేమ్ ఆఫ్ థ్రోన్స్’, ‘టైటానిక్’ నటులు మృతి చెందిన సంగతి తెలిసిందే. అలాగే మలయాళ సీనియర్ నటి కనకలత, దర్శకులు హరి కుమార్, సంగీత్ శివన్ ,బాలీవుడ్ నటి ఆశా వర్మ, మలయాళ నటుడు నిర్మల్ బెన్నీ, అలాగే మలయాళ దర్శకుడు ఎం మోహన్ వంటి వారు కన్నుమూశారు. ఆ షాక్..ల నుండి సినీ పరిశ్రమ ఇంకా కోలుకోకుండానే మరో విషాదం చోటు చేసుకుంది.

టాలీవుడ్ కి చెందిన ఓ రైటర్ (Gulabi Movie Writer) మృతి చెందడం అందరినీ విషాదంలోకి నెట్టేసినట్టు అయ్యింది. వివరాల్లోకి వెళితే.. స్టార్ డైరెక్టర్ కృష్ణవంశీ (Krishna Vamsi) తెరకెక్కించిన ‘గులాబీ’ (Gulabi Movie Writer) , అలాగే మరో స్టార్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ (Ram Gopal Varma) దర్శకత్వం వహించిన ‘అనగనగా ఒకరోజు’ చిత్రాలకు మాటల రచయితగా పనిచేసిన నడిమింటి నరసింగరావు ఈరోజు కన్నుమూశారు. ఆయన వయసు 72 ఏళ్ళు. కొన్నాళ్లుగా అనారోగ్యంతో బాధపడుతూ వస్తున్న ఆయన యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బుధవారం నాడు.. అంటే ఈ రోజు కన్నుమూసినట్టు సమాచారం.

Gulabi Movie Writer

గులాబీ , అనగనగా ఒక రోజు వంటి సినిమాలతో పాటు ‘పాతబస్తీ’, ‘ఊరికి మొనగాడు’,’కుచ్చికుచ్చి కూనమ్మా’ వంటి సినిమాలకి కూడా మాటల రచయితగా పని చేశారు నడిమింటి నరసింగరావు. నరసింగరావు కి భార్య, కుమార్తె ఉన్నారు. సినిమాల్లోకి రాకముందు ‘బొమ్మలాట’ అనే నాటకం ద్వారా పాపులర్ అయ్యారు ఈయన. ఆ తర్వాత దూరదర్శన్లో టెలికాస్ట్ అయిన తెనాలి రామకృష్ణ సీరియల్‌కి కూడా రచయితగా చేశారు.

‘సరిపోదా శనివారం’ సీక్వెల్ పై నాని ఏమన్నాడంటే..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus