Bigg Boss 7 Telugu: శోభకి తేజకి గొడవ .. ! ఎగ్ బ్యాలన్స్ టాస్క్ లో గెలిచింది ఎవరంటే.!

బిగ్ బాస్ హౌస్ లో జిలేబీ పురం వర్సెస్ గులాబీ పురం టాస్క్ నడుస్తోంది. 7వ వారం కెప్టెన్సీ టాస్క్ లో భాగంగా ఒక్కొక్కరికీ ఒక్కో క్యారెక్టర్ ఇచ్చాడు బిగ్ బాస్. ఇందులో రెండు టీమ్స్ ఉన్నాయి. ఒకటి యావర్ టీమ్ ఇంకొటి అర్జున్ టీమ్. గులాబీ పురం టీమ్ లో అమర్ దీప్, యావర్, పూజ, గౌతమ్ , తేజ ఇంకా శోబాశెట్టి ఉన్నారు. అలాగే జిలేబీ పురం టీమ్ లో సందీప్, ప్రియాంక, అర్జున్, ప్రశాంత్, భోలే ఇంకా అశ్వినిలు ఉన్నారు.

ఈ రెండు టీమ్స్ కి అంటే ఈ రెండు పురాలకి ప్రెసిడెంట్ గా శివాజీ వ్యవహరిస్తాడు. అలాగే, రెండు టీమ్స్ లో ఇద్దరు సర్పెంచ్ లు ఉంటారు. వారిలో ప్రియాంక జిలేబీ పురం ప్రెసిడెంట్ అయితే, శోభా గులాబీపురం ప్రెసిడెంట్. పూజ, ఇంకా అశ్విని ఇద్దరూ తెలుగు అమ్మాయిలు. అమర్ దీప్ ఇంక్ సందీప్ ఇద్దరూ గాసిప్స్ స్టార్స్. ఒకరు టీ కొట్టు, ఇంకొకరు కిళ్లీ కొట్టు. అర్జున్ ఊరిలో విలన్, ఆ విలన్ కి రైట్ హ్యాండ్ ప్రశాంత్. విదేశాల నుంచీ వచ్చిన ఎన్ ఆర్ ఐ ప్రిన్స్ యావర్ . గౌతమ్ ఒక రోమియో, భోలే జ్యోతిష్కుడు, టేస్టీ తేజ మాజీసర్పెంచ్ మరియు శోభాశెట్టి మొగుడు.

ఇక ఈ టాస్క్ లో ఎవరి క్యారెక్టర్ లో వాళ్లు జీవించేశారు. అశ్విని అయితే అల్లరి చిల్లర అమ్మాయిగా ఊళ్లో పెద్దమనికి అయిన ప్రెసిడెంట్ గా శివాజీ తనపై జోక్స్ వేస్తూ రెచ్చిపోయాడు. అలాగే, అమర్ దీప్ కూడా గాసిప్స్ చెప్తూ తేజకి శోభకి మీడియోటర్ గా రెచ్చిపోయాడు. జబర్ధస్త్ కంటే కూడా గట్టిగానే డబుల్ మీనింగ్ డైలాగ్స్ వేస్తూ క్యారెక్టర్స్ లో ఒకరిని మించి మరొకరు యాక్టింగ్ చేశారు. ఈ టాస్క్ నడుస్తున్నప్పుడే బిగ్ బాస్ (Bigg Boss 7 Telugu) మరికొన్ని ఛాలెంజస్ కూడా ఇచ్చాడు.

ఇందులో ఎగ్ బ్యాలన్స్ టాస్క్ ఒకటి. ఎగ్ ని చిన్న టేబుల్ పైన బ్యాలన్స్ చేస్తూ తీస్కుని వెళ్లి ట్రేలో పెట్టాల్సి ఉంటుంది. ఇలా ఎవరైతే ముందుగా ట్రేలో ఎగ్స్ అన్నీ పెడతారో వాళ్లు విన్నర్స్. ఈ టాస్క్ లోనే తేజకి ఇంకా శోభకి గొడవ జరిగింది. నీవల్లే ప్రిన్స్ చేతిలో ఎగ్ బ్యాలన్స్ తప్పిందని తేజ చెప్పాడని ప్రిన్స్ యావర్ కోపం గా వచ్చి శోభని అడిగాడు. దీంతో శోభ తిరిగి తేజ దగ్గరకి వెళ్లి నేను కావాలని చేశానని నువ్వే చెప్పావంట అంటూ నిలదీసింది. దీంతో ఇద్దరి మద్య మాటల యుద్ధం జరిగింది.

ఇక ఈ టాస్క్ లో భాగంగా ఫస్ట్ ఛాలెంజ్ లో గులాబీపురం టీమ్ గెలిచినట్లుగా సమాచారం. అయితే, ఇక్కడే అర్జున్ అండ్ ప్రశాంత్ ఇద్దరూ కూడా సమయానికి ఎగ్స్ ని తీస్కుని వెళ్లి వాళ్ల టీమ్ గెలవడంలో ముఖ్య పాత్రని పోషించినట్లుగా సమాచారం. మరి ఈ పూర్తి టాస్క్ లో పైనల్ గా గెలిచి ఎవరు కెప్టెన్సీ పోటీదారులు అవుతారు అనేది ఆసక్తికరం. అదీ మేటర్.

‘బిగ్ బాస్ 7’ వైల్డ్ కార్డ్ ఎంట్రీ నయనీ పావని గురించి 10 ఆసక్తికర విషయాలు!

‘పుష్ప’ టు ‘దేవర’.. 2 పార్టులుగా రాబోతున్న 10 సినిమాలు..!
‘బిగ్ బాస్ 7’ వైల్డ్ కార్డ్ ఎంట్రీ అశ్విని శ్రీ గురించి 10 ఆసక్తికర విషయాలు!

Read Today's Latest Bigg Boss Telugu Update. Get Filmy News LIVE Updates on FilmyFocus