Guntur Kaaram: ‘గుంటూరు కారం’ 100 రోజులు ఆడింది.. ఎన్ని సెంటర్లో తెలుసా?

ఈరోజుల్లో ఓ సినిమా 2 వారాలు థియేటర్లలో ఉండటమే చాలా పెద్ద విషయం. హిట్ అయితే వాటి రన్ ఇంకో 2 వారాలకు పెరుగుతుంది అంతే..! ఇలాంటి టైంలో ఓ సినిమా ’50 రోజులు, 100 రోజులు ఆడింది’ అని చెప్పుకోవడం కూడా విశేషమనే చెప్పాలి. వివరాల్లోకి వెళితే.. సంక్రాంతికి మహేష్ బాబు (Mahesh Babu)  హీరోగా త్రివిక్రమ్ (Trivikram)  దర్శకత్వంలో తెరకెక్కిన ‘గుంటూరు కారం’ (Guntur Kaaram) సినిమా రిలీజ్ అయ్యింది. మొదటి షోతోనే ఈ సినిమా మిక్స్డ్ టాక్ ను మూటగట్టుకుంది.

కానీ సంక్రాంతి పండగ సెలవులు, మహేష్ బాబు- త్రివిక్రమ్..లకి ఫ్యామిలీ ఆడియన్స్ లో ఉన్న ఇమేజ్ కారణంగా ‘గుంటూరు కారం’ బాక్సాఫీస్ వద్ద బాగానే సందడి చేసింది. బాక్సాఫీస్ వద్ద 85 శాతం రికవరీ సాధించి యావరేజ్ రిజల్ట్ ను సాధించింది. ఇక 4 వారాలకే ఓటీటీలో రిలీజ్ అయిన ఈ సినిమా.. తర్వాతి 4 వారాల వరకు ట్రెండింగ్ లో నిలిచి అక్కడ కూడా బ్లాక్ బస్టర్ అనిపించుకుంది. ఓటీటీలో చూసేశాక టీవీల్లో కూడా చూసే ఛాన్స్ ఉండదు.

కానీ రీసెంట్ గా జెమినీలో టెలికాస్ట్ అయినప్పటికీ 9 టి.ఆర్.పి రేటింగ్ ను సాధించి ఇక్కడ కూడా మంచి రిజల్ట్ ను అందుకుంది ‘గుంటూరు కారం’. మరోపక్క ‘కుర్చీ మడతపెట్టి’ అనే పాట యూట్యూబ్లో 200 మిలియన్ల వ్యూస్ ను కొల్లగొట్టింది. ఇంతలోనే ఏప్రిల్ 20 కి 2 కేంద్రాల్లో వంద రోజులు కూడా పూర్తి చేసుకుంది ‘గుంటూరు కారం’.

ఆంధ్రప్రదేశ్ చిలకలూరిపేటలోని రామకృష్ణ థియేటర్, కర్ణాటక ముల్బాగల్ లోని నటరాజ్ థియేటర్లలో ‘గుంటూరు కారం’ 100 రోజులు ఆడింది. ఇది నిజంగా గొప్ప విషయమే. సినిమాకి కనుక సూపర్ హిట్ టాక్ వచ్చి ఉంటే.. రిజల్ట్ దీనికి డబుల్,ట్రిపుల్ ఉండేది అనడంలో సందేహం లేదు

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus